కోబ్రా సినిమాకు టాక్ ఎలా ఉందో తెలుసా .. ప్లస్.. మైనస్ అదే..!!

తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరో చియాన్ విక్రమ్ తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. తన కెరియర్లో హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు విక్రం. అయితే ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదలైన కోబ్రా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం ఎలాంటి టాకు వచ్చింది.. ఇందులో ప్లస్ , మైనస్లు ఏంటి? అనే విషయాన్ని ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.Cobra: Vikram Starrer's TN Distribution Rights Acquired By Red Giant Movies – Deets Insideకోబ్రా సినిమాలో హీరోగా విక్రమ్ నటించిన హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించినది. ఈ సినిమాని ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ కీలకమైన పాత్రలో నటించారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్ భారీగానే వ్యూస్ నీ రాబట్టాయి. ఈ సినిమాకి తెలుగు, తమిళ్లో మంచి బజ్ ఏర్పడింది. ఇక అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా బాగా జరిగింది. కోబ్రా మూవీ తమిళంలో దాదాపుగా రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా రూ.4.50 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.60 కోట్ల వరకు మొత్తం బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా పలు ప్రాంతాలలో ఈ షో ప్రదర్శించడం అయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది.. ఇకపోతే కొంతమంది ఈ సినిమా బాగుంది అని తెలియజేయగా.. మరి కొంతమంది యావరేజ్ గా ఉందని ట్వీట్ చేస్తూ ఉన్నారు. కోబ్రా మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మొదటి భాగం అంత టెర్రిఫిక్ ఇంట్రో సీన్లతో పాటు.. ఇంటర్వెల్ ట్విస్టు తో యాక్షన్ సినిమాగా సాగింది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకి అదిరిపోయింది. అలాగే విక్రమ్ వేసిన గెటప్పులు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొంత నిరాశ పరుస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కానీ చివరిగా క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉందని సమాచారం.

ప్లస్Cobra's 3 Hours Run-Time: Highly Risky! - Movie Newsకోబ్రా సినిమాలో విక్రమ్ ను చూసినవాళ్లంతా విక్రమ్ నటన అద్భుతంగా ఉందని , అలాగే ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ , ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, గెటప్ , ఫుల్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్లస్ గా నిలిచాయి.

మైనస్Cobra Tamil Movie Preview cinema review stills gallery trailer video clips showtimes - IndiaGlitz.comసెకండాఫ్ నిడివి ఎక్కువగా ఉండడం, లవ్ ట్రాక్ ,కామెడీ లేకపోవడం లాజిక్ లేని సన్నివేశాలను తెరకెక్కించడం మైనస్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా విక్రమ్ ఈ సినిమాలో వన్ మాస్టర్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.