ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య నందినికి అప్ప‌ట్లోనే అంత భ‌ర‌ణం ఇచ్చాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తిరుగులేని ఇమేజ్‌తో అభిమానుల నుంచి పవర్ స్టార్ బిరుదు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమా తీసిన అభిమానులకు పండగే. రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్నాడు. ఇంతే కాకుండా 2014లో జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో క్రియాశీలకంగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ప‌వ‌న్‌ రాజకీయాల మీదే ఎక్కువ దృష్టిపెట్టి 2024 ఎన్నిక‌ల‌లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే ఇప్పుడు వరకు మూడు వివాహాలు చేసుకున్నారు. అందులో హీరోయిన్ మరియు దర్శకురాలైన రేణు దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నా… అనుకోని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నా లేజ్నోవా అనే ర‌ష్య‌న్ అమ్మాయిని మూడో వివాహం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మొదటి భార్య పేరు నందిని. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మొదటి వివాహం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.

చిరంజీవికి తెలిసిన కుటుంబాలలో ఒకరైన నందినిని పవన్ కళ్యాణ్ కి ఇచ్చి వివాహం చేశారు. ప‌వ‌న్ సినిమాల్లోకి రాక‌ముందే ఈ పెళ్లి జ‌రిగింది. అయితే నందినితో వివాహమైన కొద్ది సంవత్సరాలకి పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌తో సహజీవనం చేస్తున్నవార్త‌లు బయటకి రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే మొదటి భార్య పవన్ కళ్యాణ్ కు డైవర్స్ ఇచ్చిన సమయంలో ఆమెకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించినట్టు తెలుస్తుంది.

అప్పట్లోనే ఆమెకు 35 లక్షల రూపాయలు భరణంతోపాటు బంగారం వెండి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తిగానే వెంటనే డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేసే సినిమాలో బిజీ అవుతారు. ఇక ప‌వ‌న్ మూడో భార్య లెజ్నోవా సింగ‌పూర్‌లో ఉంటూ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చ‌దివిస్తోంది.

Share post:

Latest