ప్రభాస్‌ ‘సలార్‌’పై క్రేజీ అప్‌డేట్‌.. పోస్టర్ రీలిజ్‌

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు మరియు సిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్‌’ విడుదల తేదీని చిత్ర బృందం నేడు స్వ‌తంత్ర దినోత్స‌వం సందర్బంగా ఈ సినిమా విడుద‌ల తేదిని తెలిపారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేస్తామ‌ని సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తేదీని ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంతో సంబరాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ‘సలార్‌ ఆగమనం’ అనే ట్యాగ్‌ను నెట్టింట్‌ ట్రెండింగ్‌లో ఉంది. అన్న వస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.‘రాధేశ్యామ్‌’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్నసినిమాది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. యాక్ష్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఉంది.

 

Share post:

Latest