మెగాస్టార్ చిరంజీవి నటించిన సీరియల్ ఏమిటో మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు కొత్త పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ప్రస్థానం క్రియేట్ చేసుకున్న లెజెండరీ హీరోల్లో చిరు కూడా ఒకరు. టాలీవుడ్‌కు డ్యాన్స్, మాస్, కమర్షియల్ వంటి అంశాలను పరిచయం చేసిన హీరో చిరు. ఇక ఆయన చేసిన పాత్రలు, సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ట్రెండ్‌కు అనుకూలంగా మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో కూడా చేశారు.

అయితే చిరంజీవి నటించిన సినిమాలు, ఆయన చేసిన టీవీ షోల గురించి అందరికీ తెలిసిందే. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఒకటి ఉందని మీకు తెలుసా? చిరంజీవి ఒక సీరియల్‌లో కూడా నటించారు. అవును.. మీరు చదివింది నిజమే. మెగాస్టార్ చిరంజీవి ఓ సీరియల్‌లో నటించారు. ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయ్యేది సీరియల్. అందుకే, అందరికీ దగ్గరయ్యే ప్రయత్నంగా గతంలో చిరు ఓ సీరియల్‌లో కనిపించారు. కానీ, ఆయన చేసింది ఓ కేమియో పాత్ర మాత్రమే.

బాలీవుడ్‌లో రజినీ అనే సీరియల్ అప్పట్లో చాలా పాపులర్. అయితే ఈ సీరియల్‌లో చిరంజీవి ఓ సీన్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఆ సీన్ కేవలం ఒకే ఒక ఎపిసోడ్‌లో వచ్చింది. ఈ సీరియల్‌ను వీక్షించిన ప్రేక్షకులకు ఖచ్చితంగా చిరు ఎంట్రీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పటి ప్రేక్షకులకు అది ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి. ఇక ఆ సీరియల్‌లో నటించిన తరువాత ఆయన వరుసగా సినిమాలపై దృష్టిపెట్టడంతో మళ్లీ బుల్లితెర సీరియల్స్‌లో కనిపించలేదు.