మరో బాలీవుడ్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన చైతూ..ఈ సారి ఏకంగా..!!

ప్రస్తుతం తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన టాలీవుడ్ దర్శకులకు కూడా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్లు కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ క్రమంలోని రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ అక్కినేని నాగచైతన్య తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆరాటపడుతుంటే.. బాలీవుడ్ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు అంతా కూడా బాలీవుడ్ లో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక డైరెక్టర్ల విషయానికొస్తే రాజమౌళి , రాంగోపాల్ వర్మ , సందీప్ వంగ,, గౌతమ్ తిన్ననూరి లాంటి వారు కూడా ఫేమస్ అయ్యారు.Chaithu to take a new step in his career! - TeluguBulletin.com

- Advertisement -

ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల విషయానికి వస్తే.. బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ లీల భన్సాలీ ఇప్పుడు నాగచైతన్యతో సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య మొదటిసారి అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్ద సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమయ్యాడు.. అయితే అక్కడ కీలకపాత్ర మాత్రమే పోషించాడు .కానీ ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మెయిన్ హీరో పాత్ర చేస్తూ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలోని తాజాగా నాగచైతన్య సంజయ్ లీల భన్సాలీ నీ కలిసారట. ఇక పుష్పా సినిమా రిలీజ్ తర్వాత కూడా బన్నీ సంజయ్ ను కలిసినట్లు సమాచారం. కానీ ఇంతవరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ కాలేదు.Amazon-prime-chaithu News in Telugu | Breaking News in Telugu | Online News  Live Updates, తెలంగాణ వార్తలు on Amazon-prime-chaithuకానీ ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దూత అనే హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు నాగచైతన్య .ఈ వెబ్ సిరీస్ అయిన తర్వాతనే మానాడు ఫేమ్ వెంకట ప్రభు డైరెక్షన్లో మరొక సినిమా చేస్తున్నాడు. దీని వెంటనే సంజయ్ లీలా భన్సాలీ సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం.

Share post:

Popular