అభిమానులు కోరుకుంటున్న ఆ రికార్డు ..కళ్యాణ్ రామ్ సాధించగలడా.?

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న చిత్రం ఇదే అని కూడా చెప్పవచ్చు. అయితే పటాస్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక మొదటి రోజే ఏకంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రం ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.Kalyanram is Agent Vinod

అయితే కళ్యాణ్ రామ్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరాలని నందమూరి అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ ను అందుకోవడంలో పెద్ద కష్టమేం కాదన్నట్లుగా క్రిటిక్స్, నెటిజన్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ వల్లే ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుందని నందమూరి అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కళ్యాణ్ రామ్ తప్ప ఈ సినిమాలో ఎవరు నటించలేనంత అద్భుతంగా నటించారని చెప్పారు.Nandamuri Kalyan Ram announces new film Bimbisara on grandfather NTR's  birth anniversary - Movies Newsఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉండడంతో కళ్యాణ్ రామ్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు . ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో బింబిసార-2 సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఖర్చు విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడకుండా కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా తెలియజేశారు. ఇక డైరెక్టర్ మల్లిడి వశిష్ట కూడా మొదటి భాగాన్ని మించి..ఈ సినిమా స్క్రిప్ట్ రెండో భాగం ఉంటుందని తెలియజేశారు. మరి పార్ట్-2 ఎలా ఉంటుందో చూడాలి.

Share post:

Latest