‘సీతారామం’ కంటే తక్కువ ధరకు ‘బింబిసార’.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాలు ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. బింబిసార ఒక సోసియో ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కొత్త దర్శకులు వశిష్ట్ తెరకెక్కించాడు.. ఇక ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ‘సీతారామం’ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు..ఇందులో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.. ఇక రెండు సినిమాల మధ్య ప్రమోషన్స్ కూడా భారీగా చేసుకున్నారు.. ఇప్పటికే ఈ రెండు సినిమాల ట్రైలర్లు, ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి.. దీంతో ఈ సినిమాలు సక్సెస్ అవుతాయని ఇండస్ట్రీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.. ఎందుకంటే గతనెలలో విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.. పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయాయి.. దీంతో టాలీవుడ్ ‘బింబిసార’, సీతారామం’ సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది..

ఇక ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే… బింబిసార కంటే సీతారామం ఎక్కువ ధరకు అమ్ముడుపోయాయి.. సీతారామం వరల్డ్ వైడ్ గా రూ. 17 కోట్లకు అమ్ముడుపోతే.. బింబిసార రూ.16.5 కోట్లకు అమ్ముడుపోయిందట. సీతారామం నైజాం హక్కులు రూ.4 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ హక్కులు రూ.7.5 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ.2.5 కోట్లు పలికినట్లు తెలిసింది.. సీతారామం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.18 కోట్లు కాగా.. బింబిసార బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.17 నుంచి 18 కోట్లుగా చెప్పొచ్చు. వరుస నష్టాలతో ఇబ్బందిపడుతున్న టాలీవుడ్ కి ఈ రెండు విజయం సాధించడం ఎంతో అవసరం.. మరీ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయం సాధిస్తాయో ఆగస్టు 5 వరకు ఆగాల్సిందే..