‘ సీతారామం ‘ టార్గెట్ పెద్ద‌దే… ప్రి రిలీజ్ టాప్ లేపిందిగా…!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల‌ లిస్ట్ లో సీతారామం సినిమా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి తెలుగు చిత్రసీమలో పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వైజ‌యంతీ మూవీస్ చాలా ప్రెస్టేజియ‌స్‌తో ఈ సినిమాను నిర్మించి… ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వెళ్లింది. సీతారామంలో మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా చేయ‌గా… క్రేజీ డైరెక్టర్ హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వం వహించారు.సీతారామం సినిమాకు ముందుగా పాజిటివ్ వైబ్స్ వ‌చ్చేశాయి.

- Advertisement -

సీతారామం సినిమా ప్ర‌మోష‌న్లు ప్రధాన నగరాలలో భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ సినిమా బృందం సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ చేశారు. సీతారామంకు ఎవరు ఊహించ‌నట్టుగా భారీగా థియేట్రిక‌ల్ బిజినెస్ జరిగింది. సీతారామం సినిమాకు దాదాపు రూ.18.70 కోట్లకు ఫ్రి రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ క్లీన్ హిట్ అవ్వాలంటేంటే రూ.19.50 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

సీతారామంకు ఉన్న క్రేజ్ కు హిట్‌ టాక్ వస్తే వారంలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేస్తుంది. ఓ వారం రోజుల పాటు స్ట‌డీగా ఉంటే చాలు బ్లాక్ బ‌స్టర్ హిట్ గా నిలుస్తుంద‌ని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. మృనాణ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నేషనల్ క్రష్ గా పేరొందిన రష్మిక మందన ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

Share post:

Popular