పవన్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. సినిమాలు వదిలేస్తాడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేత అంటే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అంతగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఇప్పుడు రాజకీయాలే ఎక్కువ ముఖ్యంగా మారిపోయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నప్పటికీ ఆయన జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలోనే ఉన్నారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన తర్వాత మళ్లీ సినిమాలలోకి కమ్ బ్యాక్ ప్రకటించి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలను విడుదల చేశారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సెట్ పై ఉండగా మరో రెండు చిత్రాలు ప్రకటించారు. ఇకపోతే ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోని ఎక్కువ సమయం రాజకీయ కార్యక్రమాలపై కేటాయిస్తున్నారు.Pawan Kalyan's Gabbar Singh Completes 10 Years. A Look At His Past  Performancesగతంతో పోల్చితే జనసేన ఎంతోకొంత బలపడిందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. రెండు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేలో జనసేన పార్టీ ప్రస్తావనే లేకుండా పోయింది. ఇక తాజాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టిడిపికి 7 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇక మరొక జాతీయ మీడియా ప్రకారం వైసీపీకి 19, టిడిపికి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది.. ఇక సదరు మీడియా సంస్థల సర్వే ప్రకారం వైయస్ జగన్ 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని రెండోసారి అధికారం చేపట్టడం ఖాయం ఉన్నట్లు తెలుస్తోంది.TDP says it got tricked by Jana Sena chief Pawan Kalyan | Mintఇక ఈ రెండు సర్వేల్లో జనసేన, బీజేపీ కూటమికి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు అంటే జనసేన పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని పవన్ కళ్యాణ్ కి అర్ధమైనట్లుంది. అందుకే మిగిలిన ఈ కొంచెం సమయం లో కూడా కష్టపడి జనాల్లో విశ్వసనీయత సాధించాలని పవన్ కళ్యాణ్ భావించే అవకాశం ఉంది. అక్టోబర్ 5 నుండి బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి హాజరయ్యే ఛాన్స్ లేదు.. మొత్తంగా ప్రస్తుత సమీకరణాలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవుతారని అనిపిస్తుంది. మరొకవైపు హరిహర వీరమల్ల నిర్మాతల నుండి కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఒకవేళ సినిమా పూర్తి చేయలేకపోతే అడ్వాన్స్ వచ్చిన రూ.40కోట్లు తిరిగి ఇచ్చేయాలని పవన్ కోరుతున్నారట. మొత్తంగా చూసుకుంటే ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పరిస్థితి మారిపోయింది.

Share post:

Latest