బాలయ్య బాబు వీక్ నెస్ తెలిసిపోయిందిగా..అందుకే డైరెక్టర్స్ ఇలా..?

బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కూడా తనదైన శైలి లో ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న 40 లక్షల రూపాయల ఖర్చు చేసి ఎన్టీఆర్ ఆరోగ్య రథ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా అందులో 10 వేలకు పైగా వ్యాధులను గుర్తించి పరీక్షలు చేసి వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు.. లేకపోతే పెద్ద పెద్ద ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారు అంటూ బాలయ్య వెల్లడించారు. ఇక హిందూపురం ప్రజలకు బాలయ్య చేసిన ఈ మేలును చూసి అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.I don't know who is AR Rahman, says Nandamuri Balakrishna | Entertainment  News,The Indian Expressఇదిలా ఉండగా.. సినీ ఇండస్ట్రీలో బాలయ్య వీక్నెస్ తెలిసిపోయింది.. అందుకే డైరెక్టర్లు ఇలా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలకృష్ణ కి కథ నచ్చితే, డైరెక్టర్లు నచ్చితే సినిమాలు చేసేస్తారు.. ముఖ్యంగా తనకు కావలసిన అంశాలు ఉంటే చాలు డైరెక్టర్ ఎవరు అనేది ఆయన అసలు పట్టించుకోరు. ఇక అంతే కాదు బాలయ్యలో ఉన్న మరో వీక్నెస్ ని కూడా డైరెక్టర్లు కనిపెట్టి ఆయనతో వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తున్నారు.. బాలకృష్ణతో సినిమా చేయడం ఇప్పుడు డైరెక్టర్లకు ఈజీ అయిపోయింది. ఒక సినిమాకు ఓకే చెప్పించడం ఎలాగో దర్శకులకు తెలిసిపోయింది అంటూ టాలీవుడ్ లో వార్తలు చర్చనీయాంశంగా మారాయి.Nandamuri Balakrishna Wins Hearts by Making Video Call to Sick Fan

ముఖ్యంగా కథ, కంటెంట్ నచ్చితే బాలయ్య సినిమాలు చేస్తారు.. దర్శకడుని పట్టించుకోరు అనే వీక్నెస్ ని కూడా దర్శకులు యూస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని తెరకేకిస్తున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ గోపీచంద్ మలినేని కావడం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకులు కూడా తాము హిట్టు కొట్టిన సినిమాలను బాలయ్య కోసం ప్రత్యేకంగా షో వేయించి మరి చూపించడంతో ఆయన ఇంప్రెస్ అయ్యాడు. అందుకే మంచి కంటెంట్ ఉంటే దర్శకుడితో పనిలేదు బాలయ్య సినిమా చేస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు బింబిసారా సినిమా చూసిన తర్వాత యంగ్ డైరెక్టర్ వశిష్ట తో కూడా సినిమా చేస్తానని హామీ ఇచ్చారు బాలయ్య.

Share post:

Latest