యంగ్ హీరోకి ఘాటు కౌంటర్..అనుపమ మాటలకు అర్ధలేవేరులే…!

బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా , నిఖిల్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ 2. గతంలో నిఖిల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్ర పోషించారు. సినిమా ని మలుపు తిప్పే రోల్ ఈయనది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. కృష్ణుడి గాథకు సంబంధించిన అంశాలతో ‘కార్తికేయ-2’ సినిమా తెరకెక్కిందని ఇప్పతీకే చిత్ర బృందం తెలియజేసింది.

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాష్లలో ‘కార్తికేయ-2’ సినిమా ఈ నెల 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకోసం హీరో నిఖిల్ రాత్రి పగలు తెలియకుండా ప్రమోషన్స్ లో కష్టపడుతుంటే.. హీరోయిన్ అనుపమ మాత్రం ప్రమోషన్స్ కి డుమ్మా కొడుతుంది. దీని పై అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. పరోక్షంగా హీరో నిఖిల్ కూడా అనుపమను తప్పుపట్టారు. దీంతో మ్యాటర్ మరింత హీట్ పెంచింది. ఈ క్రమంలోనే అనుపమ తనదైన స్టైల్ లో అందరికి ఆన్సర్ ఇచ్చింది. తన ఇన్స్టా లో ఓ పోస్ట్ చేసి..అందరి నోర్లు మూయించింది. “నేను ఓ విషయంలో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందరు నేను కార్తికేయ ప్రమోషన్స్ కి రావట్లేదని ఏవేవో అంటున్నారు.


కానీ, నేను ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడానికి కారణం ఉంది. నేను ఇతర చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను. అస్సలు టైం ఉండటం లేదు. రాత్రి పగలు తీరిక లేకుండా షూటింగ్స్ చేస్తున్నాను. అందుకే కార్తికేయ 2 ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నాను. నా ఇబ్బంది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను”.. అంటూ పోస్ట్ చేశారు. దీంతో అనుపమ కూల్ గా ఆన్సర్ ఇచ్చిన తగలాల్సిన వాళ్లకి ఘాటుగానే ఇచ్చింది అంటూ అనుపమ మాటలకు అర్ధలేవేరులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Share post:

Latest