ఇండస్ట్రీకి మరో ఐటెం బాంబ్..హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న హాట్ హీరోయిన్ కూతురు…!

ఈమధ్య కాలంలో సినిమా హీరోల వారసులే కాదు, హీరోయిన్ల వారసురాళ్లు కూడా సినిమా పరిశ్రమలలో తమ సత్తాని చాటుతున్నారు. డాక్టర్ కొడుకు, కూతురు డాక్టర్లు అయినట్టు, యాక్టర్ కొడుకు కూతుళ్లు కూడా యాక్టర్స్ కావడం గమనార్హం. ఈ క్రమంలో మన తెలుగు పరిశ్రమను తీసుకుంటే ఓ డజనుకు పైగా వారసులు ఒకే కుటుంబం నుండి రావడం ఒకింత చోద్యంగానే కనిపిస్తుంది. ఎవరి ఇంటరెస్ట్ వారిది. ఈ నేపథ్యంలో అల‌నాటి అందాల తార ‘మాలాశ్రీ’ కూతురు వెండితెర అరంగేట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఆమె పేరు ‘రాథనా రామ్.’ ఈమె కన్నడ నాట ఛాలెంజింగ్ స్టార్ గా పేరొందిన హీరో దర్శన్‌తో కలిసి వెండితెర రంగప్రవేశం చేయనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.

ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాబర్ట్ ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజు కానుంది. ఈ సందర్భంగా నటి మాలాశ్రీ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి నా కూతురుని పెద్ద నటిని చేయాలని కలలు కన్నాను. నేటితో అది నెరవేరినందుకు చాలా సంతోషంగా వుంది.” అని చెప్పుకొచ్చింది.

రాధన నటనలో అన్ని మెళకువలు నేర్చుకుందని ఆమె అన్నారు. ముంబైలో నటన, డ్యాన్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించిందట. ఇకపోతే మాలాశ్రీ ప్రేమఖైదీ, బావబామ్మర్ది, పోలీస్‌ అల్లుడు, అల్లరి పోలీస్‌, బంగారు మొగుడు, తోడి కోడళ్లు.. వంటి పలు హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది.

 

Share post:

Latest