అన్న ఎన్టీఆర్‌ యాక్టింగ్ సూప‌ర్బ్‌.. ఫైట్ల‌లో ఆయ‌న ఎందుకు వీక్ అంటే…!

ఎన్టీఆర్ సినీ అభిమానులు త‌ర‌చుగా చెప్పే మాట ఇది. ఎన్ని పాత్ర‌లు చేసినా.. ఎన్ని `వేషాలు` వేసినా.. అన్న‌గారిని ఆరాధించ‌ని అభిమాని అంటూ ఎవ‌రూ ఉండ‌రు. పిచ్చి పుల్ల‌య్య నుంచి శ్రీకృష్ణావ‌తారం వ‌ర‌కు.. బ్ర‌హ్మంగారి నుంచి క‌విసార్వ‌భౌమ శ్రీనాధుడి వ‌ర‌కు అన్ని పాత్ర‌ల‌నూ ఆయ‌న అభిమానులు ఎగ‌బ‌డి చూశారు. మెచ్చుకున్నారు. ఆయ‌న ప్ర‌తిరూపాన్ని గుండెల్లో దాచుకున్నారు. కానీ, ఇన్ని పాత్ర‌ల‌ను ఆరాధించిన అభిమానులు.. అన్న‌గారు చేసే ఫైట్ సీన్ల‌ను మాత్రం జీర్నించుకోలేక పోయేవారట‌!

“ఆయ‌న కృష్ణుడి వేషం వేస్తే.. దానిని ఫొటో క‌ట్టించుకుని ఇళ్ల‌లో పెట్టుకున్న ఎంతో మంది నాకు తెలుసు. ఒక్కొక్క న‌టుడికి ఒక్కొక్క పాత్ర‌లో లీనం అయ్యే అవ‌కాశం ఉంటుంది. కానీ, ఎన్నో పాత్ర‌లు.. ఎన్నో వేషాలు ఆయ‌న కోస‌మే పుట్టాయా.. ఆయ‌న కోస‌మే ర‌చ‌యిత‌లు రాశారా? అన్న‌ట్టుగా ఉండేవి“ అని గ‌తంలో గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఇదే విష‌యాన్ని అనేక సంద‌ర్భాల్లో అనేక మంది న‌టులు చెప్పారు.కానీ, ఎవ‌రూ కూడా అన్న‌గారు చేసిన ఫైటింగ్ సీన్ల గురించి మాత్రం చెప్పేవారు కాదు.

అదే చిరంజీవి స‌హా ఇత‌ర న‌టుల గురించి చెబితే.. వారి ఫైట్లు, యాక్ష‌న్ సీన్లు చెప్పుకోకుండా.. ఉండ‌లేం. కానీ, అన్న‌గారి విష యంలో మాత్రం ఫైట్ సీన్ల‌కు అంత సీన్‌లేదు. దీనికి కార‌ణం.. ఓ సంద‌ర్భంలో అన్న‌గారే చెప్పారు. “నాకు ఫైట్ ఎందుకు.. అయినా.. నాతో ఫైట్ చేసే మొన‌గాడు పుట్టాడా!“ అని చ‌లోక్తులు విసిరేవారు. కానీ, అన్న‌గారితో ఫైట్ చేయాలంటే.. ద‌ర్శ‌కులు కూడా ఇష్ట‌ప‌డేవారు కాద‌ట‌. కేవ‌లం డూపును పెట్టి లాగించేవార‌ట‌. అది కూడా అత్య‌వ‌స‌రం.. డిమాండ్ ఉంటేనే!

ఇక‌, విఠ‌లాచార్య చిత్రాల్లో జాన‌పద బాణీలో న‌టించాల్సి వ‌స్తే.. క‌త్తి దూసేప్పుడు అన్న‌గారిని క్లోజ‌ప్ షాట్‌లో చూపించేవార‌ట‌. త‌ర్వాత‌.. మాత్రం డూపుతోనే లాగించేవార‌ట‌. సాంఘిక చిత్రాల్లో మాత్రం అస‌లు దాదాపు ఫైట్లు లేకుండా చూపించేవారు. దీనికి కార‌ణం.. అన్న‌గారి సౌష్ఠ‌వం.. ఫైట్ సీన్ల‌కు న‌ప్ప‌ద‌నే భావ‌న‌తోపాటు.. అన్న‌గారి అభిమానులు సైతం.. ఆయ‌న‌ను యాక్ష‌న్ సీన్ల‌కే ప‌రిమితం చేయ‌డం అని త‌ర‌చుగా ఈ మాట విన‌బ‌డుతూ ఉండేది. ఇదీ.. సంగతి!!