యాంకర్ అనసూయ వారిని వదిలిపెట్టదట… పోలీస్ కంప్లైంట్ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్లిన వివాదం!

యాంకర్ అనసూయ అంటే ఎవరో తెలియని యువత తెలుగునాట ఉందనే ఉండదు. జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా పరిచయం అయిన అమ్మడు అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఓ క్రమంలో అయితే కేవలం ఆ ప్రోగ్రాం ఆమెకోసమే చూసిన విధంగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ. దాంతో ఆమెను వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ రావడం వలన ఆ షోకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత రష్మీ ఎంటర్ అయ్యింది.

ఈ క్రమంలో ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దాంతో ఆమె తన అభిరుచులు, హాట్ ఫోటోషూట్స్‌ లాంటివి ఆన్ లైన్ మాధ్యమాలలో పోస్ట్ చేసేది. ఇలా తన అభిమానులను రెట్టింపు చేసుకుంది. అయితే ఇదే విషయంలో ఆమెకి అప్పుడప్పుడు కొన్నిరకాల చెడు అనుభవాలు ఎదురవుతూ వస్తున్నాయి. సామజిక మాధ్యమాల్లో స్వేచ్ఛగా స్పందించే వెసులుబాటు ఉండటంతో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇలా అనసూయ విషయంలో చాలాసార్లు జరిగింది. ఎన్నో సందర్భాల్లో ట్రోల్స్ బారిన పడిన ఈ జబర్దస్త్ బ్యూటీ చివరకు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లింది.

ఇకపోతే తాజాగా లైగర్ సినిమా విడుదల అయిన తరువాత అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండపై ఓ ట్వీట్ చేయడం ఆన్ లైన్ రచ్చకు తెరలేపింది. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ అనసూయ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో అనసూయ Vs విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వార్ తారాస్థాయికి చేరుకుంది. మాట మాట పెరుగుతూ అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రౌడీ స్టార్ విజ‌య్ దేవరకొండ ఫ్యాన్స్ నడుమ దుమారం రేగింది. ఈ క్రమంలోనే అనసూయపై ఓ రేంజ్ అటాక్ చేశారు కొందరు నెటిజన్లు. ఆంటీ అంటూ అనసూయపై ఓ రేంజ్లో ట్రోలింగ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన అనసూయ.. ఇక మీ అందరి పని పడతా. అలా కామెంట్లు పెడుతున్న వాళ్లందరిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చేసింది.

Share post:

Latest