యాంకర్ అనసూయ అసహనం! మీ చెల్లినో.. భార్యనో అయితే ఇలాగే అడుగుతావా?

గత రెండు మూడు రోజులనుండి సోషల్ మీడియాలో బాగా వినబడుతున్న సెలిబ్రిటీ పేరు యాంకర్ అనసూయ. అవును… ఓ సందర్భంలో సోషల్ మీడియాలో లైవ్ లో పాల్గొన్న అనసూయకి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ఆమె గుండె చివుక్కుమంది. ఈ క్రమంలో అమ్మని అవమానిస్తే కర్మ వదిలిపెట్టదంటూ ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాని వెనకాల వుండే కహాని గురించి ఇపుడు చెప్పుకుంటే అసందర్భంగా ఉంటుంది కానీ, విషయంలోకి వెళ్ళిపోదాం.

ఆంటీ అనేమాట నుండి మొదలైన ఈ వివాదం నేటివరకు నిరంతరం కొనసాగుతూనే వుంది. అయితే అనసూయ మాత్రం ట్రోలర్స్ కి వీలైనంతవరకు వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయంలో కొందరు ఆమెను సపోర్ట్ చేస్తే.. ఓ వర్గం వారు మాత్రం ఆమెని తీవ్రంగా వేధిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఒక పనికిమాలిన ట్రోలర్ ‘నీ రేటెంత?’ అనే అర్ధం వచ్చేలా కామెంట్ చేయగా దానికి అనసూయ భయపడకుండా అంతే ఘూటుగా సమాధానం ఇచ్చారు. మీ చెల్లినో, లేక మీకు పెళ్లై.. మీ భార్య లేదా చెల్లి ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? అని అడిగితే ఏం చెప్తారు అంటూ బదులిచ్చారు.

దీంతో సో కాల్డ్ ట్రోలర్ కి దిమ్మ తిరిగి బొమ్మకనబడింది. దాంతో తాను చేసిన కామెంటుని తానే డిలేట్ చేసాడు. కాగా అనసూయ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో దాదాపుగా అందరు ఆమెనే సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళను గౌరవించలేని వాడు తన అమ్మ – తోబుట్టువులను ఏరకంగా గౌరవించగలడు అని? అతగాడిని ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఎక్కువగా ఆడవారే ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పురుష ప్రపంచంలో ఆడవారికి ఆడవారే సపోర్ట్ చేయాలి కదా మరి!

Share post:

Latest