“ఆ ఉసురు ఊరికే పోదు”..లైగర్ రిజల్ట్ పై అనసూయ సంచలన కామెంట్స్..!?

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటే ఇదే కాబోలు. పూరి జగన్నాథ్ లైగర్ విషయంలో అదే జరిగింది. అందరూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. పూరీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది ..అని బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎలా అవుతుంది? ఊహించిన పరిణామాలు జరిగినప్పుడే లైఫ్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే పొజిషన్ లో ఉన్నాడు లైగర్ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.

నిజానికి లైగర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆయనకున్న పాపులారిటీ.. జనాల్లో ఆయనకున్న పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్.. చూసి కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ..బొమ్మ మొదటి షో పడగానే సినిమా అసలు మ్యాటర్ బయటపడింది. బ్లాక్ బస్టర్ హిట్ కాదు కదా కనీసం యావరేజ్ గా కూడా నిలవలేదు. అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది. దీంతో లైగర్ హీరో విజయ్ దేవరకొండ పై నెట్టింట హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది.

కొందరు గతంలో ఆయన చూపించిన తాటిట్యూడ్.. ఆయన మాట్లాడిన మాటలు కారణంగా హర్ట్ అయిన జనాలు.. ఇప్పుడు విజయ్ దేవరకొండ ని ఆడేసుకుంటున్నారు. లైగర్ సినిమా ని బేస్ చేసుకుని పరోక్షంగా విజయ్ దేవరకొండపై ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు. ఆ లిస్ట్ లోకే తాజాగా ఎంటర్ అయినట్లు తెలుస్తుంది యాంకర్ అనసూయ. మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమా విషయంలో అనసూయకు విజయ్ దేవరకొండకు ఎంత పెద్ద వార్ జరిగిందో. అప్పట్లో ఆ వార్ సంచలనంగా మారింది. ఆ తర్వాత పరిస్థితి సర్ధుమణిగినా ఆ గొడవకు సంబంధించిన హీట్ మాత్రమే ఇద్దరి మధ్య అలాగే ఉండిపోయింది. దీంతో అనసూయ కరెక్ట్ టైం లో సరైన పాయింట్ చూపి విజయ్ దేవరకొండ పై పరోక్షంగా ఘాటుగా స్పందించిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొద్దిసేపటి క్రితమే అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసి ఎవరైనా సరే.. కచ్చితంగా ఇది విజయ్ దేవరకొండ లైగర్ మూవీకి సంబంధించిన కౌంటర్ అని చెప్పొచ్చు. అంత క్లియర్ గా తెలుస్తుంది అమ్మడి పోస్ట్ . అనసూయ పోస్ట్ చేస్తూ..” అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ రావడం మాత్రం పక్క”.. అంటూ ఘాటైన ట్వీట్ చేసింది. ఈ ట్విట్ కి విజయ్ దేవరకొండ లైగర్ ని జోడిస్తూ నెటిజన్స్ ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో అనసూయ విజయ్ దేవరకొండ వార్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తున్నారు. దీంతో అనసూయ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

 

Share post:

Latest