‘ లైగ‌ర్ ‘ కోసం విజ‌య్‌, అన‌న్య రెమ్యున‌రేష‌న్లు ఇవే…!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా లైగ‌ర్. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ – అనన్య‌ పాండే జంట‌గా న‌టించారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల‌ రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన ఒక వార్త‌ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Vijay Deverakonda comes face to face with Mike Tyson as they begin US  schedule of 'Liger' - Entertainment News

ఈ సినిమా రెమ్యూనిరేషన్ విషయంలో హీరోయిన్ అనన్య పాండేకు అన్యాయం జరిగిందని ఒక వార్త బయటకు వచ్చింది. హీరో విజయ్ దేవరకొండ కి ఈ సినిమా కోసం 20 నుంచి 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో నటించిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన‌ మైక్ టైసన్‌కు కూడా ఏకంగా రు. 30 కోట్ల‌కు పైనే ఇచ్చార‌ట‌.

ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్యాకి మాత్రం కేవలం మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చార‌ని టాక్. రు. 100 కోట్ల బడ్జెట్ లో హీరోయిన్ కి మాత్రం కేవలం 3 కోట్లు ఇవ్వడం విచిత్ర‌మే. రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా అనన్యా పాండే ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది.

Liger Song Aafat Out: Vijay Deverakonda-Ananya Panday Groove At The Beach

విజయ్ – అనన్యాల‌ జోడీ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు. బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ చేసింది. విజయ్ కెరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీ కానుందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

 

Share post:

Latest