రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటిటి లో వచ్చేది ఎప్పుడంటే..!!

ప్రస్తుతం కొన్ని సినిమాలు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించి థియేటర్ విడుదలైన కొద్దిరోజుల తర్వాత తప్పనిసరిగా పలు ఓటీటి లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లో కన్నా డిజిటల్ మీడియాలోనే పలు సినిమాలను చూసే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే సినిమాలను థియేటర్లలో విడుదలైన వెంటనే ఓటీటి లో కూడా విడుదల చేయకూడదని నిర్ణయాన్ని తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే రవితేజ డైరెక్టర్ శరత్ మండల దర్శకత్వంలో వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడం జరిగింది కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కి ఫ్యాన్సీ డీల్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరలకే అమ్ములు పోయాయని ప్రముఖ ఓటీటి సంస్థ అయిన సోనీ లైఫ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే అందుకు సంబంధించి పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సోనీ లైఫ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ఎనిమిది వారాల తరువాత స్ట్రిమింగ్ అయ్యే అవకాశం ఉన్నది.OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకున్న "రామారావు ఆన్ డ్యూటీ" |అయితే సినిమా విడుదలైన తరువాత నాలుగు వారాలకు లేదా ఆరు వారాలకు ప్రతి ఒక్క సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యేవి ఇలా తొందరగా సినిమాలు ట్రిమ్మింగ్ కావడం వల్ల థియేటర్ కు వచ్చే జనాల సంఖ్య రాను రాను తగ్గిపోతూ ఉండడంతో.. నిర్మాతలు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ ఆఫీసర్ గా కనిపించారు. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు ముఖ్యమైన పాత్రలో అలనాటి హీరో తొట్టెంపూడి వేణు కూడా నటించారు.

Share post:

Latest