రామారావుతో రవితేజ తప్పు చేశాడా?

మాస్ రాజా రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కు బిర్యానీ దొరికినట్లే అనే భావన ఉంటుంది. ఆయన చేసే సినిమాల్లో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. ఇక రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ సినిమాల్లో ఈ సినిమా అదిరిపోతుందని చిత్ర దర్శకుడు శరత్ మండవ గొప్పగా చెబుతూ ఈ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే ఈ సినిమా తొలిరోజే ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో, మాస్ రాజా అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అంతేగాక, ఈ సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా థియేటర్లకు పెద్దగా రాకపోవడం వారిని మరింత నిరాశకు గురిచేసింది. ఇక ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడం, కేవలం మాస్ అనే ఒక్క పదం కోసం కథను అడ్డదిడ్డంగా మలిచిన దర్శకుడు శరత్‌పై రవితేజ అభిమానులు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర డైరెక్టర్ శరత్ మండవను రవితేజ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు. ఇలాంటి సినిమా ఏ కొత్త హీరోతోనైనా చేయొచ్చని, తమ హీరోకు అనవసరంగా ఫ్లాప్‌ను అంటగట్టావంటూ శరత్‌కు చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లగా నటించారు.

Share post:

Latest