ఎన్టీఆర్ వల్లే ఆ నటుడి జీవితం నాశనమైందా..?

ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే తమ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టకూడదు అని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు కూడా.. కానీ ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు తెలియకుండానే వేరే వాళ్ల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. కానీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రముఖ నటుడు జే.వీ.సోమయాజుల జీవితం నాశనమయింది. ఇక ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఏమిటి?ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల సోమయాజుల జీవితం నాశనం అవ్వడానికి కారణం ఏమిటి ? ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1928 జనవరి 30వ తేదీన శ్రీకాకుళంలో జన్మించిన సోమయాజులు.. శంకరాభరణం సినిమాతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఈయన బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా అంతటా నటించి తనదైన గుర్తింపును చాటుకున్నారు. ఇక తన సోదరుడు రమణామూర్తితో కలిసి ఎన్నో నాటకాలలో ప్రదర్శించారు. ఇకపోతే ఇద్దరూ కూడా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగారు. ఇకపోతే విజయనగరంలో సోమయాజులు చదువుకున్న సమయంలో ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఇక అలా తన తల్లి ప్రోత్సాహంతోనే గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం లో సోమయాజులు వేసిన పాత్ర ఆయన జీవితంలోని చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక ఈ నాటకం 40 సంవత్సరాలలో 500 సార్లు ప్రదర్శించబడింది.

ఇకపోతే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. సినిమాలలో, నాటకాలలో అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తున్న ఈయన 150 సినిమాలకు పైగా నటించారు. ఇకపోతే సోమయాజులు తన 55 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం వలన ఆయన తన జీవితాన్నే కోల్పోయారు అని చెప్పవచ్చు. 55 సంవత్సరాలకే ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేయాలనే ఎన్టీఆర్ నిర్ణయంతో అనేకమంది తమ ఉద్యోగాలను కూడా వదులుకున్నారు. అలా రాష్ట్ర సాంస్కృతిక శాఖకు డైరెక్టర్గా పనిచేస్తున్న సోమయాజులు పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇక చివరికి ఆంధ్ర యూనివర్సిటీ సోమయాజులకు మరొక గౌరవాన్ని కూడా ఇచ్చి.. రంగస్థలం శాఖకు అధిపతిగా ఈయనను నిర్ణయించడంతో ఆయన పరిధిలోని అనేక నాటకాలు ప్రదర్శించబడ్డాయి.