నాగచైత‌న్య సినిమాల ఓపెనింగ్స్ ఇవే.. ‘ థ్యాంక్యూ ‘ కు ఇంత ఘోర అవ‌మాన‌మా…!

 

నాగ‌చైత‌న్య వ‌రుస‌గా త‌న ఖాతాలో నాలుగు హిట్లు వేసుకున్నాడు. మ‌జిలి, ల‌వ్‌స్టోరి, వెంకీమామ‌, బంగార్రాజు వంటి సినిమాల‌తో జోష్‌లో ఉండి తాజాగా థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. అక్కిన్యేని ఫ్యామిలికీ మ‌నం లాంటి మంచి మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చిన విక్ర‌మ్‌.కే కుమ‌ర్‌తో నాగ‌చైత‌న్య థాంక్యు అనే మూవీ చేసాడు.

అస‌లు ముందు నుంచే ఈ సినిమాపై పెద్ద‌గా బ‌జ్ లేదు. ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు కూడా ప్ర‌మోషన్ల‌ను లైట్ తీస్కొన్నాడు. ఎలాంటి అంచ‌నాల్లేకుండా థియేట్ల‌లోకి వ‌చ్చిన థాంక్యు సినిమాకు చాలా త‌క్కువ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. బీ, సి సెంట‌ర్ల‌లో సినిమా చూడాల‌ని ఎవ్వ‌రూ అనుకోవ‌డం లేదు.

ఫ‌స్ట్ వీకెండ్‌లో థ్యాంక్యూ గ‌ట్టిగా రు. 3 కోట్ల షేర్ కూడా రాబ‌ట్ట‌లేదు. అంటే ఫ‌స్ట్ వీకెండ్లోనే స‌గ‌టున రోజుకు కోటి షేర్ రాలేదు. ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రు. 15 కోట్ల‌కు పైగా న‌ష్టం త‌ప్పేలా లేదు. నాగ‌చైత‌న్య ఫ్లాప్ సినిమాల‌కు కూడా ఇంత‌కంటే పెద్ద ఓపెనింగ్స్ వ‌చ్చాయి. స‌వ్య‌సాచి సినిమా ప్లాప్ అయినా ఫ‌స్ట్ డే రు. 3 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. దీనిని బ‌ట్టి థ్యాంక్యూకు ఎంత ఘోర అవ‌మానం మిగిలిందో అర్థ‌మ‌వుతోంది.

థాంక్యు- 1.65 కోట్లు

ల‌వ్‌స్టోరి- 7.13 కోట్లు

మ‌జిలీ – 5.6 కోట్లు

స‌వ్య‌పాచి- 3.29 కోట్లు

శైల‌జారెడ్డి అల్లుడు – 6.93 కోట్లు

బంగార్రాజు – 9.06 కోట్లు (మాల్టీస్టార‌ర్‌)

వెంకీమామ – 7.05 కోట్లు (మాల్టీస్టార‌ర్‌)

Share post:

Latest