చేజేతులారా తన కెరీర్ని పాడు చేసుకున్న సుమంత్..!!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమ కథ సినిమాతో 1999లో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా అందులోని పాటలు మాత్రం ఆల్ టైం క్లాసికల్ హిట్టుగా నిలిచాయి. దీంతో చాలా సినిమాలు సుమంత్ రిజెక్ట్ చేయడం వల్ల వదులుకోవలసి వచ్చింది .. ఈ సినిమాలు చేసి ఉంటే హీరో కెరియర్ వేరే లాగా ఉండేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు వాటి గురించి చూద్దాం.

నువ్వే కావాలి సినిమా మొదట హీరో సుమంత్ కి చెబితే వద్దన్నాడట ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిన కూడా ఆ సినిమాని రిజెక్ట్ చేయడంతో చివరికి తరుణ్ దగ్గరికి వచ్చి చేరింది దీంతో తరుణ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా కథను కరుణాకరన్ హీరో సుమంత్ కు వినిపించగా అప్పటికే అనుభవం లేని డైరెక్టర్ కావడం చేత అక్కినేని ఫ్యామిలీ ఆ సినిమాను రిజెక్ట్ చేయడం జరిగిందట ఇక చివరికి పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో ఆ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఎమ్మెస్ రాజు నిర్మించిన మనసంతా నువ్వే వంటి బ్లాక్ బస్టర్ సినిమా మహేష్ బాబు హీరోగా చేయాలనుకుంటే సాఫ్ట్ కదా అని ఒప్పుకోలేదు ఆ తర్వాత హీరో సుమంత్ దగ్గరికి వెళ్లగా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు దాంతో ఉదయ్ కిరణ్ ని సంప్రదించగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక సుమంత్ రిజెక్ట్ చేసిన మరొక సినిమా ఆనందం.. అప్పటికే తొలి ప్రేమ కథ సినిమాలలో నటించిన సుమంత్ ఇక డైరెక్టర్ శ్రీనువైట్ల చెప్పిన కథ ప్రేమ కథ కావడంతో ఈ సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడట. దీంతో ఈ కథను కూడా రిజెక్ట్ చేశారు ఆ తర్వాత ఆకాష్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇవే కాకుండా డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం, దేశముదురు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర సినిమాలు రిజెక్ట్ చేసి తన కెరియర్ ని చేచేతుల నాశనం చేసుకున్నారు సుమంత్.