పెళ్లికి సిద్ధమైన శ్రీముఖి.. కండిషన్స్ అప్లై..!!

బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన యాంకర్ శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మాటలతో చేష్టలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా హాట్ ఫోటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. కేవలం బుల్లితెర పైన కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో హీరోకి చెల్లిగా , అక్కగా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ముఖ్యంగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్న నేపథ్యంలో ఈమె వ్యవహార శైలిపై అప్పుడప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో భాగంగానే కొంతకాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు రెండు తెలుగు రాష్ట్రాలలో తెగ హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.Sreemukhi leaves fans on tenterhooks with her stunning photoshoot and  cryptic post; says, 'waiting to announce a great news' - Times of India

ఇక ఈ క్రమంలోని ఈ ముద్దుగుమ్మ ఒక సింగర్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని.. కానీ వరుడు తండ్రి కండిషన్స్ పెట్టారు అని సమాచారం. నిజానికి ఇండస్ట్రీలో స్థిరపడాలని లక్ష్యంతో అడుగుపెట్టిన శ్రీముఖి జులాయి సినిమాతో నటిగా తన కెరియర్ను మొదలు పెట్టింది. ఇక తర్వాత జెంటిల్మెన్, నేను శైలజ వంటి సినిమాలలో నటిగా నటించిన శ్రీముఖి ప్రేమ ఇష్క్ కాదల్ , బాబు బాగా బిజీ , క్రేజీ అంకుల్స్ వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

ఇకపోతే శ్రీముఖి సరిగమప అనే షోలో సింగర్ గా పోటీపడుతున్న సాయి శ్రీ చరణ్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిఆర్పి రేటింగ్ కోసం చేస్తున్నారా? లేక వీళ్ళ జంట నిజంగానే లవ్ ట్రాక్ నడుపుతున్నారా? అనే విషయం మాత్రం అర్థం కాలేదు. కానీ ఈ షో కి వీరి జంట హైలెట్ అవుతుందని చెప్పవచ్చు. ఇకపోతే సరిగమప షో లో సాయి శ్రీ చరణ్ తో శ్రీముఖి లవ్ లో పడినట్లు చూపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బాగా వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో సాయి శ్రీ చరణ్ తో కలిసి పాట పాడిన తర్వాత అతడి తండ్రిని మామయ్య అంటూ శ్రీముఖి పిలిచింది . దీనితో ఆయన స్టేజ్ మీదకు వచ్చి మా ఆవిడ రాలేకపోయింది అన్నారు.. అత్తమ్మా నా అని అడిగింది శ్రీముఖి.. ఇక అత్తమ్మో గిత్తమ్మో అన్ని ఫన్నీ సెటైర్ వేస్తూనే మా ఆవిడ నిన్ను మూడు ప్రశ్నలు అడగమనింది. నువ్వు సమాధానం చెబితే మాకేం అభ్యంతరం లేదు అని చెబుతూనే.. నీకు ముగ్గు వేయడం వచ్చా అని ప్రశ్నించారు సింగర్ తండ్రి.. దీనికి సమాధానంగా ముగ్గులో దించడం వచ్చు మావయ్య అని చెప్పింది. ఇక దీంతో ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest