వాటి మోజులో పడి అమ్మ అనే పదానికి దూరమైన సీనియర్ హీరోయిన్స్..!!

సినిమా అంటే పిచ్చితో చాలా మంది తమ జీవితాలను కోల్పోయారు అని చెప్పడంలో సందేహమే లేదు. సాధారణంగా ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి తమ జీవితాన్ని కొంతవరకు కేటాయించి మిగతా సమయాన్ని తమ వ్యక్తిగత జీవితాలకు కేటాయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం సినిమాలకే తమ పూర్తి జీవితాన్ని అంకితం చేసి తమ వైవాహిక జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ఇక ఏమిటా తప్పు అంటే అమ్మ అనే పదానికి శాశ్వతంగా దూరం కావడమే.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళా కూడా అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతో తాపత్రయపడుతుంది. ఇక ఆ పదం కోసం ఎన్నో సంవత్సరాలు పరితపిస్తుంది. అయితే కొంతమంది అనారోగ్య కారణాలవల్ల తల్లి కాలేకపోతే.. మరికొంతమంది కొన్నింటి మీద వ్యామోహం, పిచ్చి కారణంగా అంత మధురమైన క్షణాన్ని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. ఇక అలాంటివారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే సినిమాల మీద మోజుతో తమ జీవితాన్ని నాశనం చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

1. రేవతి:Revathi wins Kerala Film Award 38 yrs after debut: 'It's not late,' actor  tells TNM | The News Minuteతన అందచందాలతో కుర్రకారు గుండెల్లో పదిలంగా ఉండిపోయిన ఈ ముద్ద గుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక ఈమె నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగు , తమిళ్ , హిందీ భాషా చిత్రాలలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి కెరియర్ పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహము అనంతరం పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుందని భావించిన ఈమె పిల్లలను కనడమే మానేసింది. అమ్మ అనే పిలుపుకు దూరమై ఇప్పుడు బాధపడుతోంది.

2. విజయశాంతి:Vijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత  స్టార్స్‌కు దూరంగా..లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో సినీ ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకుంది. ఇటు సినిమాల ద్వారా, అటు రాజకీయాలలో కూడా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె కూడా శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్న తర్వాత అమ్మ అనే పదానికి దూరమైంది.

3. శారద:Actress Sharada: శారద చనిపోయిందంటూ వార్తలు.. బతికే ఉన్నానంటున్న సీనియర్  నటి.. | Death rumors over National award winning actress Sharada and she  gets serious on fake news pk– News18 Teluguతనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె తెలుగు, తమిళ్ , మలయాళం భాషా చిత్రాలలో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు చలం అనే నటుడిని వివాహం చేసుకుంది. వివాహమనంతరం టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈమె పిల్లలు కనడం అనే విషయాన్ని మర్చిపోయింది.

4.జయప్రద:Jayaprada: Moonlight signature on the silver screen..Evidence of Indian  female beauty..Acha Telugammai Jayaprada's birthday today .. | Actress  politician Jaya Prada Happy Birthday today - filmyzoo - Hindisipఅంద చందాలతో కుర్రకారుని మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మెహతాను వివాహం చేసుకున్న ఈమె ఎక్కువకాలం ఆయనతో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది. ఇక తర్వాత మరొక వివాహం చేసుకోలేదు తల్లి అనే పదానికి శాశ్వతంగా దూరమైంది.