ఇండస్ట్రీలో నెపోటిజం..నాగ్ మామకు రాడ్ దింపేసిన సమంత..!!

బాప్ రే సమంత కు అక్కినేని ఫాయ్మిలీ పై ఇంత కోపం ఉందా..అని అంతా అనుకుంటున్నారు. దానికి కారణం ఆమె తాజా గా కాఫీ విత్ కరణ్ షో లో చేసిన వ్యాఖ్యలే కారణం. విడాకులు తీసుకున్న తరువాత ఎవ్వరైన ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కామన్. కానీ, సమంత ఇక్కడ తప్పు అంత అక్కినేని ఫ్యామిలీదే అన్నట్లు నాగ చైతన్య పై తోసేసింది. “మా విడాకులు ఏం కూల్ గా అయిపోలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత..అస్సలు నాగ చైతన్య ని తన భర్త గా పిలవడానికి కూడా ఇష్టపడకపోవడం..ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేసిన విడాకుల మ్యాటర్ ని ఫస్ట్ టైం కాఫీ విత్ కరణ్ షో లో రివీల్ చేసింది. “మా ఇద్దరిని ఒక్కే గది లో పెడితే ..మీరు పదునైన వస్తువులు కూడా పెట్టాలి అంటూ..కరణ్ కి నాగ చైతన్య పై ఉన్న కోపాని చెప్పేసింది. ఇక ఎప్పటి నుండో ఇండస్ట్రీలో పాతుకు పోయిన నెపొటిజం అన్న పాయింట్ ని లేవదీస్తూ.. పరోక్షంగా నాగ్ మామ కు మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

సమంత నెపొటిజం పై మాట్లాడుతూ..”సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల కొడుకులు, డాటర్లు..ఇంకా వారి బంధువులు…వాళ్ల పిల్లలు ..ఏదోక రిలేషన్ షిప్ చెప్పుకుని ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. హీరోలు అవుతారు.. కానీ విజయ్‌ దేవరకొండ లాంటి గట్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఎటువంటి సపోర్ట్ లేకుండా..చిన్న స్దాయి నుండి వచ్చి స్టార్‌గా మారుతారు. ఇది చాలా రేర్..’ అంటూ పరోక్షంగా నాగచైతన్య ని విమర్శిస్తూనే..విజయ్ ని డైరెక్ట్ గా పొగిడేసింది.

అంతేకాదు,..ఓ ఉదాహరణ చెప్పుతూ..” ఒక తండ్రి కోచ్‏గా ఉన్నప్పుడు..అతను తన కొడుకు గేమ్ ఆడే సమయంలో పక్కన నిల్చుని చూదగలడే తప్పిస్తే..ఏం చేయలేరు..అంత దైవ నిర్ణయం. ఇది అలాగే..నాన్న, అమ్మ, తాతలు పేర్లు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చినా మనలో టాలెంట్ లేకపోతే..జనాలు లైక్ చేయరు..అంటూ పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేసింది సమంత. నెపొటిజం పై సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.