అదే నిజమైతే.. జనగణమనకు భారీ బొక్కే..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్..పూరీ జగన్నాధ్ కలలు కన్న ప్రాజెక్ట్ ..” జనగణమన”. ఈ సినిమా కోసం కొన్నేళ్ళు రాత్రి పగలు నిద్ర లేకుండా..ఆరోగ్యానికి, కుటుంబాని పట్టించుకోకుండా కష్టపడ్డాడు. తీరా స్క్రిప్ట్ పూర్తి అయ్యి..మహేష్ బాబు కి స్టోరీ చెప్పి నచ్చి..ప్రాజెక్ట్ అఫిషీయల్ గా అనౌన్స్ చేసి..రేపో మాపో షూటింగ్ అనగా..సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఇప్పటికి క్లారిటీ లేదు.

కొందరు ఏమో మహేష్ కి పూరీ లైనప్ నచ్చలేదు అంటారు..మరికొందరు పూరీకి-మహేశ్ కి కొన్ని ఈగో ప్రాబ్లమ్‌స్ వల్ల ఈ సినిమా ఆగిపోయిందంటారు. అయితే, రీసెంట్ గా ఈ సినిమాని మళ్ళి తెర పై కి తీసుకొచ్చి…రౌడీ హీరో విజయ్ దేవరకొండతో..కమిట్ అయ్యాడు పూరీ. ఇది వరకే వీళ్ళు లైగర్ సినిమా చేసారు. ఆ టైంలో వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ స్ట్రాంగ్ అయ్యి..అది కాస్తా పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన వరకు తీసుకెళ్లింది.

అయితే, ఈ సినిమాని అనౌన్స్ చేసిన్నప్పటి నుండి ఓ పెద్ద ప్రశ్న ..నెటిజన్లు వేధిస్తుంది. విజయ్ అనగానే మనకు గుర్తు వచ్చేది అర్జున్ రెడ్డి ..ఆ యాటిట్యూడ్..పొగరు..రొమాన్స్..ఇలాంటివే గుర్తువస్తాయి. అంతెందుకు లైగర్ లో కూడా..ఇలాంటి సీన్స్ ఉన్నట్లు ..ఇప్పటికే చిత్ర బృందం కన్ఫామ్ చేసింది. మరి జనగణమన సినిమాలో అవి ఉంటాయా అంటే.. లేవనే అంటున్నారు సినీ విశ్లేషకులు. జనగణమన సినిమా మొత్తం దేశభక్తి..ఆర్మీ కి సంబంధించిన విషయాలనే చూయిస్తారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ లో విజయ్ ఆర్మీ ఆఫిసర్ గా మనకు కనిపించాడు. మరి ఈ సినిమాలో పూజా లాంటి హాట్ బ్యూటీని పెట్టుకుని..రొమాంటిక్ సీన్స్ లేకపొతే పూజా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అలా అని ఆర్మీ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తీస్తే..జనాల బుర్రకి అస్సలు కధ ఎక్కదు..ఇలా రెండు కన్ ఫ్యూజన్స్ మధ్యలో కధ తేడా కొట్టి..అసలకే మోసం వచ్చే ఛాన్సులు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. మరి పూరీ ఏం చేస్తాడో..చూడాలి..?

Share post:

Latest