నా చివరి కోరిక అదే అంటున్న రెజీనా..?

ఎస్ఎంఎస్ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రెజీనా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, సుబ్రమణ్యం ఫర్ సేల్ తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఈమె కేవలం హీరోయిన్ గానే కాకుండా మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవల రెజీనా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈమె పలు విషయాలను తెలియజేయడం జరిగింది.Southern film industry is changing, says actress Regina Cassandra

ఈ క్రమంలోని రెజీనా మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది బెస్ట్ అనిపించేవారు ఉన్నారని, ఎక్కువగా తను రకుల్ ప్రీతిసింగ్ తో క్లోజ్ గా ఉంటానని తెలియజేసింది రెజీనా. అలాగే సందీప్ కిషన్, సాయి తేజ్ వాళ్లతో కూడా ఎక్కువగా టచ్ లోనే ఉంటాను ఇప్పటివరకు నేను నటించిన దర్శకులలో ప్రవీణ్ సత్తారు వర్కింగ్ స్టైల్ బాగా నచ్చుతుంది అలాగే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలోనైనా నటించాలనేదే నా చివరి కోరిక అని తెలియజేసింది. ఎందుచేత అంటే ఆయన తీసే సినిమాలలో నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలియజేసింది.I'm really happy to do remake of Rajamouli film

ఇక అంతే కాకుండా రెజీనాకు మొదటి నుంచి ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టము. అందుకే 14 ఏళ్ల వయసులోనే తను గర్భవతిగా నటించానని ,నన్ను నేను ప్రజెంటేషన్ చేసుకోవడానికి చాలా ఇష్టపడతానని తెలియజేసింది. తనకు ఇప్పటికి నటిగా రోల్స్ వస్తున్నాయి అంటే తన హార్డ్ వర్క్ కారణమని తెలియజేసింది. నేను డైరెక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయనని అలాగే వారు కూడా తనని ఎంతగానో నమ్ముతారని తెలియజేసింది రెజీనా. మరి ఈ హీరోయిన్ కలను రాజమౌళి నెరవేరుస్తారా లేదా అనే విషయం తెలియాలి అంటే వేచి ఉండాల్సిందే..

Share post:

Latest