ఆ హీరోతో లిప్ లాక్ చేస్తా..కానీ, క్రేజీ కండీషన్ పెట్టిన క్రష్మిక..?

క్రష్మిక..యస్..ఇప్పుడు ఇండస్ట్రీలో అమ్మడుని అంతా ముద్దుగా ఇలా నే పిలుస్తున్నారు. నేషనల్ క్రష్ గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు..ప్రజెంట్ ఫుల్ ఫాం లో దూసుకుపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బడా ప్రాజెక్ట్స్ లను లైన్లో పెట్టుకుని.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్..మధ్యలో కోలీవుడ్..ఇలా మూడు ఇండస్ట్రీలను ఏలేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోలందరికి రష్మిక పైనే కన్ను పడింది.

అల్లు అర్జున్ ” పుష్ప” మూవీ తో పాన్ ఇండియా స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ..ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అవకాశాలు సంపాదించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అమ్మడు లిప్ లాక్ మ్యాటర్ బాలీవుడ్ లో ట్రెండ్ అవుతుంది. అమ్మడు బాలీవుడ్ లో ఓ క్రేజీ ఆఫర్ పట్టేసిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్ లో యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో హీరో గా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు.


నిజానికి ఈ సినిమాలో ఓ ఘాటు లిప్ లాక్ సీను ఉంటుందని డైరెక్టర్ ముందుగానే..రష్మిక కు చెప్పారట. అప్పుడు అమ్మడు నో చెప్పిన్నట్లు సమాచారం. అయినా కానీ, డైరెక్టర్..రష్మిక ను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకుని..అమ్మడుకి మంచి ఛాన్స్ ఇచ్చాడు . తీరా..ఇప్పుడు ఆ సీన్ షూట్ చేయాల్సిన టైం..వచ్చిన్నప్పుడు మళ్లీ డైరెక్టర్ లిప్ లాక్ సీన్ గురించి..రష్మికను అడగ్గా..ఆమె..”ఓకే చేస్తాను..కానీ మీరే మా అమ్మని అడిగి ఒప్పించండి”..అంటూ క్రేజీ కండీషన్ పెట్టిందట. దీంతో కొంచెం సేపు నవ్వుకున్న..డైరెక్టర్ ..వద్దులే అంటూ దండం పెట్టి సరదాగా వెళ్ళిపోయారట.

Share post:

Latest