‘ది వారియర్’ ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్..రామ్ కెరీర్ లోనే ఇది రికార్డ్..!!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..లింగుస్వామీ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం..”ది వారియర్”. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోలీస్ ఆఫిసర్ గా నటించిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. లింగుస్వామీ గత సినిమాలు చూసి..ఇప్పుడు ఈ సినిమా చూసిన జనాలు అస్సలు ఈ సినిమా తీసింది ఈయనేనా..అనే డౌట్లు వస్తున్నాయి . అంత విసుకు తెప్పించింది ఈ సినిమా జనాలకు.

 

కృతి శెట్టి ని గ్లామర్ పరంగా వాడుకోవడంలో లింగుస్వామీ ఫెయిల్ అయ్యాడు అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఆమె పై క్లోజ్ షాట్స్ వేయడం..దీంతో జనాలకు స్క్రీన్ మూతం ఆమె నోరు నే కనిపిస్తుంది తప్పిస్తే..ఆమె హాట్ అందాలు ఎక్కడ కనపించలేదు. బుల్లెట్ సాంగ్ పుణ్యమా అంటూ సినిమా క్రేజ్ వచ్చినా…రిలీజ్ అయ్యాక మాత్రం..మొత్తం తుస్సు మనిపించింది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా చాలా కామన్ సీన్స్ జనాలకు బోర్ కొట్టించాయి. సినిమా మొత్తానికి రాం యాక్షన్ సీన్స్ తప్పిస్తే..మిగిలిన అన్ని సీన్స్ ఎక్కడో ఓ సినిమాలో చూసినవి గానే బుర్రకి వస్తున్నాయి.

 

మరి ఇన్ని నెగిటీవ్ కామెంట్స్ తెచ్చుకున్న వారియర్ కలెక్షన్స్ పరంగా మెప్పిస్తుందా అని అనుమానించిన జనాల అంచనానే కరెక్ట్ అయ్యింది. ఫస్ట్ ది వారియర్ సినిమా దారుణ కలెక్షన్స్ నమోదు చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ది వారియర్’ చిత్రానికి రూ. 18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 4.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇక అదే గ్రాస్ పరంగా మనం చూసుకుంటే.. 4.02 కోట్లు వచ్చాయి. కాగా, ఏరియా వారిల గా కలెకషన్లు చూస్తే.. నైజాం 0.82 కోట్లు,సీడెడ్ 0.39 కోట్లు,ఉత్తరాంధ్ర 0.32 కోట్లు, ఈస్ట్ 0.13 కోట్లు,వెస్ట్ 0.09 కోట్లు,గుంటూరు 0.12 కోట్లు,కృష్ణా 0.13 కోట్లు.నెల్లూరు 0.07 కోట్లు నమోదు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్..టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ 7.2 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది .

 

రామ్ కెరీరో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాదించిన రెడ్ దాదాపు 6.2కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈస్ ఇది రామ్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిందనే చెప్పాలి. ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 7.2 కోట్లు నమోదు చేసింది . కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 16.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ రేంజ్ కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ చేయాలి అంటే చాలా క్ష్టం అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద సేఫ్ అయ్యే అవకాశం తక్కువే అని అర్ధమవుతుంది. నిజానికి హీరో రామ్ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం బాగానే వస్తాయి. కానీ లింగుస్వామీ మిస్తేఅక్ వల్ల ‘ది వారియర్’కి మాత్రం పూర్తి రివర్స్ లో కలెక్షన్స్ ఉన్నాయి అంటున్నారు రామ్ అభిమానులు.