చిరు-రవితేజ కాంబో లీక్… అలనాటి అందాల తార నటిస్తోంది తెలుసా?

తాజాగా చిరు-రవితేజ కాంబో షురూ అయిన సంగతి తెలిసినదే. ఈ సినిమాకి దర్శకుడు బాబీ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ముగ్గురి కలయిక అనగానే మగాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు కూడా ఈ సినిమాకోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమానుండి రవితేజ జాయిన్ అవుతున్నట్టు ఓ గ్లిమ్ప్స్ రిలీజైన సంగతి విదితమే. అలాగే తాజాగా మరో విషయం ఈ సినిమానుండి బయటకు పొక్కింది.

ఆ తార మరెవరోకాదు?

ఈ సినిమాలో అలనాటి అందాల నటి సుమలత నటించబోతున్నారని వినికిడి. సుహాసిని, రాధికలతో పాటు ఎంతో ప్రభావవంతమైన నటిగా సుమలత ఆనాడు పేరు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన గ్యాంగ్ లీడర్ చిత్రంలో సుమలత నటించి మెప్పించింది. ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ చిరు- రవితేజ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ లో ఓ కీలక పాత్రకు సుమలతను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇటీవల సీనియర్ నటి సుమలత కుమారుడు హీరోగా రంగ ప్రవేశం చేస్తున్నారని కథనాలొచ్చాయి. ఇంతలోనే సుమలత రీఎంట్రీ గురించి ఆసక్తికర అప్ డేట్ అందింది.

సినిమా ఎప్పుడు మొదలవ్వబోతోంది?

మెగాస్టార్ చిరంజీవి- రవితేజ కలయికలో బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు వాల్టేర్ వీరయ్య అనేదానిని వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నారు. ఇందులో సుమలత రవితేజ తల్లిగా కనిపించనున్నారు. అయితే సినిమాపైన ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఇప్పటికే రవితేజ ఈ సినిమా సెట్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలో సుమలత కూడా టీమ్ లో జాయినవుతున్నారు. సుమలత ప్రముఖ నటుడు అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంబరీష్ అనారోగ్యం కారణంగా 2018లో మరణించారు.