నెట్టింట మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి..?

మంచు లక్ష్మీ.. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి నిర్విరామంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. మొదటగా విదేశాలలో తన విద్యను పూర్తి చేసి అక్కడే పలు షోలకు యాంకర్ గా పనిచేసిన ఈమె ఇంగ్లీష్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక తెలుగులోకి వచ్చిన తర్వాత ఈమె తెలుగులో కూడా పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకపక్క సినిమాల ద్వారా పలు ప్రయోగాలు చేసింది. అంతేకాదు వెబ్ సిరీస్ లో అంటూ డిఫరెంట్ యాంగిల్స్ టచ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా నేటిజనులతో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక సినిమాల ద్వారానే కాదు పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా సెలబ్రిటీ కిడ్ అనిపించుకుంది మంచు లక్ష్మి. ఇక తెలంగాణలో ఏకంగా 50 విద్యాసంస్థలను దత్తత తీసుకొని మూడు సంవత్సరాల పాటు వాటికి కావలసిన అన్ని ఫెసిలిటీస్ను అందిస్తామని ఈమె తెలిపింది. ఇక దీంతో మంచు లక్ష్మిపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారుతుంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా తన కొత్త సినిమా టైటిల్ ను ఆమె అనౌన్స్ చేసి ఆ సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

అగ్ని నక్షత్రం అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్లను ఇస్తూ మరో పాత్రను కూడా అందరికీ పరిచయం చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఇకపోతే ఈ సినిమాలో కేరళ నటుడు సిద్ధిక్ భాగమవుతున్న నేపథ్యంలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా వదులుతూ పదునైన కామెంట్స్ కూడా చేసింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి పోస్ట్ చేస్తూ అత్యంత శక్తివంతుడు ఫెరోషియన్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాము. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరి తరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్ధిక్ గారు మా సినిమాలో ఒక భాగం అవ్వడం మాకు గర్వకారణం అంటూ లక్ష్మి పేర్కొంది.

Share post:

Latest