‘బింబిసార’ ట్రైలర్ : కల్యాణ్ రామ్ గూస్ బంప్స్ పర్ఫామెన్స్..ఇరగదీశాడు భయ్యా ..!!

నందమూరి ఫ్యామిలీ అంటేనే నటనకు మారుపేరు. మరి అలాంటి ఆ నందమూరి హీరో సినిమా అంటే ఎలా ఉంటాది..అద్దిరిపోవాల్సిందే. ధియేటర్స్ కి వచ్చిన జనాలు విజిల్స్ వేస్తే.. టాప్ లేచి పోవాలి. సరిగ్గా అలాంటి పవర్ ఫుల్ స్టోరీతో..డబుల్ ఎనర్జీ మిక్స్ చేసి..మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్.

నిజం చెప్పాలంటే కల్యాణ్ రామ్ కి ఈ మధ్య కాలంలో హిట్ పడలేదు. గతం లో కూడా రెండో , మూడో సినిమాలు తప్పిస్తే పెద్దగా చెప్పుకోతగ్గ హిట్లు లేవు. అయితే, ఈ సారి మాత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి రెడీ అయ్యి మన ముందుకు వచ్చాడు “బింబిసార” రూపంలో. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ఓ చారిత్రక కథాంశంతో రాబోతున్న సినిమానే ఈ ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలు పెంచేయగా..తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్, టూ గుడ్ గా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాటో గ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని..ట్రైలర్ ను బట్టే అర్ధమైపోతుంది. ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్ మరియు ఎలివేషన్ షాట్స్ సినిమా పై భారి అంచనాలు పెట్టుకునే లా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ లుక్స్, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి డైలాగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. రిలీజ్ అయిన ట్రైలర్ లో ఎన్ని డైలాగ్స్ ఉన్నా..” రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం” అంటూ బింబిసార రూపంలో మనకు కనిపించనున్న కళ్యాణ్ రామ్ తన విశ్వరూపాన్ని ఈ ట్రైలర్ లో బాగా ఎలివేట్ చేశారు. మొత్తంగా ఈ సినిమాతో తిరుగులేని విజయాని అందుకోబోతున్నాడు నందమూరి హీరో అన్నది వాస్తవం.

Share post:

Latest