సీత కెరియర్ ముగిసినట్టేనా? ఆందోళనలో అభిమానులు..!!

కొంతమంది హీరోయిన్లు మొదట ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి వాళ్లు ట్రెడిషనల్ కు వ్యతిరేకంగా నటిస్తూ ఉంటారు. అలాంటివారు చాలామంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అలాంటి వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. మొదట పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు అవకాశాల కోసం గ్లామర్ షోలు కూడా చేస్తున్నది. ఇక తాజాగా గత కొద్దిరోజుల క్రితం తన అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శించింది.Awesome Actress Anjali Images Free Download

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా నటించి మంచి పేరు సంపాదించింది. దీంతో ఈమె ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది. అయితే ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా హీరోయిన్గా నటించింది. కానీ తెలుగులో మాత్రం ఈమెకు అంతగా గుర్తింపు రాలేకపోయింది.. అంజలి 2006లో ఫోటో సినిమాతో మొదటగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా నటించింది .అక్కడే వరుస సినిమాలలో చేసుకుంటూ ఉండేది. జర్నీ సినిమా తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం వల్ల ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.Actress World 💃 on Twitter: "Actress #Anjali Unexpected Hot 🤗from  #PaavaKadhaigal Web series #PaavaKadhaigalTrailer @ActressWorld14  #Actressworld https://t.co/0xx8RKfpRR" / Twitter

ఇక ఆ తర్వాత పలు సినిమాలో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. ఇక చివరిగా వకీల్ సాబ్ సినిమాలో నటించగా తన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అయితే అంజలి టాలీవుడ్ లోకి ఎన్నిసార్లు రీయంట్రీ ఇచ్చినా కూడా సక్సెస్ రాకపోవడానికి మరొక కారణం ఉందట. తను అతి తక్కువ సమయంలోనే సీనియర్ హీరోల సరసన నటించి తన డిమాండ్ ని తగ్గించుకోవడమే అందుకు ముఖ్య కారణమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ, ఐటెం సాంగులలో నటించడం వల్ల ఈమెకు సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇప్పుడు గ్లామర్ షో చేయడానికి కూడా సిద్ధమైంది. అంతేకాకుండా ఈమధ్య కొత్త హీరోయిన్లు రావడం వల్ల పలు అవకాశాలు రావట్లేదని స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం ఈమెకు హీరోయిన్గా ఏ అవకాశాలు రావట్లేదు దీంతో ఈమె చేతిలో ప్రస్తుతం వున్న వాటిల్లో అన్నీ స్పెషల్ సాంగ్ లలోనే నటిస్తున్నది. దీంతో ఈ అమ్మడు కెరియర్ ముగిసినట్టే అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

Share post:

Latest