మహేష్ తల్లి సీతామాలక్ష్మి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

మహేష్ తల్లి సీతామాలక్ష్మి పేరు వినగానే ప్రతి ఒక్కరికి నిజం సినిమా గుర్తుకి వస్తుంది. ఇక ఈ సినిమాలో తన భర్తను చంపిన వారందరినీ కొడుకు సహాయంతో ఆమె ఎలా చంపగలిగింది అనే విషయం చూస్తేనే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే అయినా హిందీలో మాత్రం తన జెండా పాతేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే బాలీవుడ్ లో సత్తా చాటి స్టార్స్ గా ఎదిగిన వారిలో చాలామంది దక్షిణాది వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రాంగోపాల్ వర్మ, జయప్రద, హేమమాలిని, ఎల్వీ ప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇక అలాంటి వారిలో సీతామాలక్ష్మి అలియాస్ తాళ్లూరి రామేశ్వరి కూడా ఒకరు.Nijam Telugu Movie Part 09/13 || Mahesh Babu, Rakshita, Rasi ||  Shalimarcinema - YouTubeప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్న రామేశ్వరి.. శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇకపోతే దిగ్గజ నటుడు నజీరుద్దీన్ షా పక్కన సునయన అనే సినిమా చేస్తుండగా రామేశ్వరి కంటికి గాయం అయింది. దీని కారణంగా ఆమెను తీసేసారు. అంతేకాదు అనారోగ్యం దృష్ట్యా తనంతటతానే ఆశా సినిమా నుంచి కూడా తప్పుకోవడంతో రామేశ్వరి టాలెంట్ చూసిన నిర్మాత మాత్రం ఆమెకు నయమయ్యే వరకు నిరీక్షించి సినిమా తీశారు. ఇక అలా దుల్హన్ వోహి జో పియా మన్ భాయే, ప్రతిభ, ద్రోహి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ లో ఒక అరుదైన ఘనత సృష్టించింది. Do You Know About Actress Talluri Rameswari's Connection To Punjabi Cinema?ఇక అక్కడ స్టార్ సెలబ్రిటీగా ఎదుగుతున్న సమయంలోనే.. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ హీరోగా ఈమె హీరోయిన్గా నటించిన సీతామాలక్ష్మి సినిమా మంచి విజయం సాధించింది.Nijam movie fame Talluri Rameshwari background and movie career, Talluri  Rameshwari, Nijam, Mahesh babu, Teja, Talluri Rameshwari movies, - Mahesh  Babu, Nijam, Nijamtalluri, Teja

ఇక తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని 1988లో చిన్నోడు పెద్దోడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఈ రెండూ సినిమాలలో హీరోయిన్ గా నటించడానికి కారణం చంద్రమోహనే. ఇక ఆ తర్వాత నిజం సినిమాలో హీరోకి తల్లిగా నటించిన ఈమె రౌడీ ఫెలో , నందనవనం 120 కిలోమీటర్స్ వంటి సినిమాలతో పాటు అమెరికా అమ్మాయి అనే సీరియల్ లో కూడా నటించి తెలుగువారిని బాగా అలరించింది.

Share post:

Latest