టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్న ప్రేక్షకులలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. దాదాపుగా అందరూ హీరోలు సమానమే స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక అంతే కాకుండా కెరియర్ పరంగా కూడా ఒకేలా ఉండడంతోపాటు సినిమాల విజయాలు అపజయాల్లో కూడా ఒకే రకంగానే ఉన్నారు. అయితే ఒక ప్రముఖ మీడియా జూన్ నెలలో సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించడం జరిగింది. ఇందులో టాలీవుడ్ హీరోల టాప్ టెన్ జాబితాని విడుదల చేయడం జరిగింది. వాటి గురించి చూద్దాం.
అయితే ప్రభాస్ ఈసారి మొదటి స్థానంలో నిలుచున్నారు. ప్రభాస్ నటించిన గత చిత్రాలు సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సైతం నిరాశ చెందారు. అయితే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ మొదటి స్థానం సంపాదించుకోవడం ఆయన అభిమానుల సైతం పలు విధాలుగా కామెంట్లు తెలియజేస్తున్నారు. ప్రభాస్ తరువాత స్థానంలో ఎన్టీఆర్ నిలవడం జరిగింది. ఎన్టీఆర్ RRR సినిమా సక్సెస్ తో సంతోషంలో ఉన్న తారక్ రెండవ స్థానం లో నిలవడం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.
స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలవడం జరిగింది. మహేష్ బాబు మాత్రం ఈసారి నాలుగో స్థానంలో ఉండగా.. రాంచరణ్ ఐదవ స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో.. హీరో నాని ఏడవ స్థానంలో నిలవడం జరిగింది . ఇక నాని నటించిన అంటే సుందరానికి సినిమా రీసెంట్గా విడుదలైన అది ఫ్లాప్ గానే నిలిచింది. ఇక చిరంజీవి మాత్రం ఎనిమిదవ స్థానంలో నిలిచారు. విజయ్ దేవరకొండ తొమ్మిదవ స్థానంలో నిలవగా, రవితేజ పదవ స్థానంలో నిలిచారు. అయితే ఈ జాబితా ప్రతినెల మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ లిస్ట్ కాస్త వైరల్ గా మారుతూనే ఉంది.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jun 2022) #OrmaxSIL pic.twitter.com/EjnrJAmzKk
— Ormax Media (@OrmaxMedia) July 15, 2022