నైట్ కాల్ చేసి..ఆ వీడియోతో బెదిరించాడు ..గెటప్ శ్రీను రీఎంట్రీ పై బిగ్ బాంబ్ పేల్చిన మాజీ కంటెస్టేంట్..?

స్టేట్ పాలిటిక్స్ కన్న ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా తయారైయాయి..జబర్ధస్త్ పాలి “ట్రిక్స్”. హ్యాపీ గా ఒకరి జోలికి పోకుండా..వేసిన స్కిట్లనే మళ్లీ మళ్లీ వేస్తూ..కడుపుబ్బ నవ్వించే జబర్ధస్త్ కమెడియన్స్ ని..ఇండస్ట్రీలో కొన్ని జగత్ కంత్రీ కెటుగాళ్ళు..దారి మళ్ళించి ..డబ్బు ఎర గా వేసి.. జబర్ధస్త్ నుండి బయటకి వచ్చేలా చేశాయి అని అంటున్నారు..కొందరు కమెడీయన్స్. మనకు తెలిసిందే..తినడానికి తిండి లేక..టాలెంట్ ఉన్నా ఆఫర్స్ లేకుండా..రోడ్డు పై తిరుగుతు..పడుకున్న టాలెంటెడ్ కమెడీయన్స్ ను పిలిచి..వాళ్ళ జీవితాలను బాగుపరిచాడు ఏడుకొండలు.

సీన్ కట్ చేస్తే..కొందరు కమెడీయన్స్ జబర్ధస్త్ వదిలి వెళ్ళిపోయారు. కారణాలు ఏవైన సరే..వెళ్ళిపోయాక మనం ఇక్కడి వాళ్లని బ్లేమ్ చేయకూడదు. కానీ , కొందరు మాత్రం అన్నం పెట్టిన విశ్వాసాని మరిచి..జబర్ధస్త్ పై మల్లెమాల పై దారుణ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో షో మేనేజర్ ఏడుకొండలు..కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు . RP కి అంత సీన్ లేదని..మాట్లాడటానికే భయపడేవాడు..ఇంత తెగించి కామెంట్స్ చేయడని..ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు జబర్ధస్త్ ని విడిచి వెళ్లిన ఒక్కరు కూడా బాగుపడలేదని..రోడు పై తిరుగుతున్నారని చెప్పుకొచ్చాడు .

కాగా, తాజా శుక్రవారానికి సంబంధించిన ఎక్స్ట్రా జబర్ధస్త్ ప్రోమోని రిలీజ్ చేశారు జబర్ధస్త్ వాళ్లు. ఈ ప్రోమోలో గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇచ్చాడు. దీని పై అందరు హ్యాపీ గా ఉన్నా..ఓ మాజీ కంటెస్టెంట్ మాత్రం గుర్రుగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏడుకొండలు..గెటప్ శ్రీను ని బెదిరించాడని..నైట్ కాల్ చేసి..బయటకు వెళ్లిన కంటెస్టెంట్ ల పరిస్ధితిని వీడియో రూపంలో చూయించి భయపెట్టి ఇలా..ఫైనల్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇప్పిచ్చాడని చెప్పుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. మరి చూడాలి సుడిగాలి సుధీర్ కూడా..ఇలాగే రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది..?