క్రియేటివిటీని తలపిస్తున్న.. పెద్దలు కుదుర్చిన దుల్కర్ ప్రేమ వివాహం..!

దుల్కర్ సల్మాన్.. మొదటిసారి నేరుగా సీతారామం సినిమా ద్వారా తెలుగులో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో శరవేగంగా పాల్గొంటున్న ఈయన తన పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించడం జరిగింది. అయితే ఈయన పెళ్లి కథ వింటే మాత్రం నిజంగా ఒక సినిమా తీయొచ్చు అని విన్న వారంతా చెబుతున్నారు. చాలా అద్భుతంగా.. ఆశ్చర్యకరంగా.. అనుకోకుండా ఈయన ప్రేమ పెళ్లి జరిగింది అని అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు.Eid 2021: Dulquer Salmaan's family photos feat wife Amaal, daughter Maryam  go viral

ఇక దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం.. ముఖ్యంగా దీనిని నేను దైవసలంకల్పంగా భావిస్తున్నాను.. ఎందుకంటే నా భార్య అమల్ సూఫీది చెన్నై.. ఇక తనకు తెలిసిన వాళ్ళు మా అమ్మకు బాగా తెలుసు . ఇక వారి ద్వారానే మా అమ్మ కి తన ఫోటోలు రాగా..ఆ ఫోటోలను నాకు పంపింది. ముఖ్యంగా వారు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడంతో నేను దుబాయ్ లో ఉద్యోగం చేసేటప్పుడు.. మా అమ్మ ఆ ఫోటోలను నాకు పంపించింది. ఇక పెళ్లి ప్రపోజల్ వచ్చింది చేసుకోమని నాతో చెప్పింది . ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను పెద్దగా తనను పట్టించుకోలేదు.Dulquer Salmaan Posted The Cutest Family Photo And Message For His Dad's  Birthday

అయితే ఒకసారి నేను చెన్నైకి వెళ్ళినప్పుడు..నా స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాను. ఇక నా ముందు సీట్లో తను కనిపించడం..ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు వుందే అని అనిపించింది.అయితే నేను ఇంకా అప్పటికి సినిమాల్లోకి రాలేదు. కాసేపటికి గుర్తుకు వచ్చి పెళ్లి ప్రపోజల్ కి ఈ అమ్మాయి ఫోటో కదా పంపించారు అని గుర్తు చేసుకున్నాను. మరొక విచిత్రం ఏమిటంటే కాలేజీలో నాకు జూనియర్. అనుకోని విధంగా చోటు చేసుకున్న ఈ సంఘటనలన్నీ నాకు దైవ సంకల్పంగా అనిపించింది .వెంటనే ఈ విషయాన్ని నేను వెళ్లి మా అమ్మకు చెప్పడంతో తనను డేట్ కి కూడా పిలిచాను. ఇక తాను కూడా నేనంటే ఇష్టమని చెప్పింది. దీంతో 2011లో పెద్దలు మా పెళ్లిని జరిపించారు.Dulquer Salmaan shares heartwarming birthday wish for daughter Maryam: 'Our  joy and blessing' | Entertainment News,The Indian Express

నేను సినిమాల్లోకి రావడం.. ఒక కుమార్తె కూడా పుట్టడం అన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతం మా కుమార్తె మరియం అమైరా సల్మాన్ వయసు 6 సంవత్సరాలు అంటూ తన పెళ్లి ప్రేమ కథను చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్.

Share post:

Latest