‘జయం’ సినిమాకి గోపీచంద్ రెమ్యూనరేషన్ చూస్తే షాకే… ఇంత త‌క్కువా…!

గోపీచంద్.. పరిచయం అక్కర్లేదు. డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగిడిన గోపిచంద్ తనకంటూ ఓ మార్కుని క్రియేట్ చేసుకున్నాడు. అతను ఒక్కరోజులో హీరో అయిపోలేదు. తొలి సినిమా ‘తొలి వలపు’తో కెరీర్ మొదలుపెట్టిన గోపీచంద్ తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మొదలయ్యాయి గోపీచంద్ కష్టాలు.తరువాత తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. అయితే కెరీర్ పరంగా గోపిచంద్ హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం రవి కుమార్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘యజ్ఞం’ సినిమానే.

- Advertisement -

ఆ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
అనంతరం కెరీర్ పరంగా చాలా ఆచితూచి వ్యవహరించాడు గోపీచంద్. తరువాత వచ్చిన ఒక్కడున్నాడు, ఒంటరి, ఆంధ్రుడు, సాహసం, సౌర్యం, గోలీమార్ వంటి సినిమాలు వలన వైవిధ్యమైన సినిమాలు చేసేవాడిగా మంచి గుర్తింపు సాధించాడు. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇంతవరకు పడలేదు. ఈ మధ్య వచ్చిన సీటీమార్ కొంత వరకు పర్వాలేదు అనిపించింది. అయితే తాజాగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన “పక్కా కమర్షియల్‘ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన గోపీచంద్ జయం మూవీకి తేజ గారు ‘పదకొండు వేలు’ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

వాటిని ఎలా ఖర్చుచేశారంటే..?
సదరు యాంకర్ వాటిని ఎలా ఖర్చుపెట్టారు అని అడిగితే.. వాటిని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాలేదు నాకు అన్నాడు గోపీచంద్. తేజ గారి లక్కీ నంబర్ 11 అంటా.. అందుకే నాకు 11 వేలు ఇచ్చారు. అలా అయితే దాని పక్కన ఇంకో సున్నా ఉండొచ్చు కదా అని సరదాగా చెప్పుకొచ్చారు గోపిచంద్. ఈ సినిమా అనంతరం డైరెక్టర్ శ్రీవాస్ తో మరో చిత్రం చేసునున్నాడు గోపిచంద్. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి వుంది.

Share post:

Popular