స్టార్ హీరోలకు కూడా దక్కని అరుదైన ఘనత సాధించిన చైతూ.. కారణం..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తన సహనటీ అయిన సమంతను ప్రేమించి వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోవడం జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయం ఇంకా ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ప్రపంచంలోనే ఏ హీరో ఏ సినిమాతో సాధించలేని రికార్డును సైతం నాగచైతన్య ఒక చిత్రంతో సాధించాడని వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం.

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది పలు రికార్డులను సైతం తిరగ రాయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఒక సినిమా బ్రేక్ చేసిన రికార్డును సైతం మరొక సినిమా బ్రేక్ చేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని చిత్రాల రికార్డు మాత్రం ఎప్పటికీ ఒకేలాగనే ఉండిపోతుంది. అటువంటి రికార్డులు మన తెలుగు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఎటువంటి బ్రేక్ అవ్వని ఒక రికార్డు మాత్రం అలాగే ఉన్నది. అదేమిటంటే అప్పట్లో కొన్ని సినిమాలు వంద రోజులు ఆడడం చాలా సులువుగా ఉండేది కానీ ఇప్పట్లో కనీసం 50 రోజుల కూడా థియేటర్లలో సినిమాలు ఆడడం లేదు. అప్పట్లో ఎక్కువగా ఒకే సినిమా నాలుగు ఐదు సార్లు విడుదల అవుతూ ఉండేవి..Watch 100 PERCENT LOVE full movie Online in HD Qualityఅయితే కొన్ని చిత్రాలు మొదటిసారి విడుదలైనప్పుడు మాత్రమే 100 రోజులు ఆడుతూ ఉంటాయి కానీ రెండవసారి విడుదలై 100 రోజులు ఆడిన సినిమా ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉన్నది.. అది కూడా ఒక సంవత్సరం తర్వాత రెండవ సారి కూడా రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడిన చిత్రం ఏమిటంటే 100% లవ్. ఈ సినిమా 2011 మే 6న విడుదలై సరిగ్గా ఏడాదికి మళ్ళీ ఇంకొక థియేటర్లో విడుదల అయ్యి ఏకంగా 100 రోజులు ఆడింది ఇలాంటి రికార్డు కేవలం యువ హీరో నాగచైతన్య కి మాత్రమే దక్కింది. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ల బెస్ట్ గా నిలిచింది. ఏడాది తర్వాత.. తెలంగాణలోని ఖమ్మం వినోద థియేటర్లో ఈ సినిమా సెకండ్ టైం రిలీజ్ అయ్యి.. ప్రపంచంలోనే ఏ సినిమాకు లేని ఘనతను దక్కించుకుంది.