సమంతపై మోజు పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో.. కామెంట్స్ వైరల్..!!

సమంత.. దేశ సినీ ఇండస్ట్రీలో ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి ఈమె తన సినిమాల కంటే నాగచైతన్యతో ప్రేమ , పెళ్లి, విడాకుల విషయంపై ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుందని చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ సీజన్ సెవెన్ కి హాజరైన సమంత.. తన భర్తతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా పలు రకాల వ్యాఖ్యలతో వెల్లడించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక మరొకవైపు బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం, యాక్షన్స్ సన్నివేశాలలో ఆకట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి వార్తలతో ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ లో తన జెండా పాతడానికి ప్రయత్నాలు చేస్తోంది.Samantha- Ranveer Singh's picture goes viral, will both the stars work  together in a film?

ముఖ్యంగా బాలీవుడ్ లో పరిచయాలు పెంచుకుంటూ అక్కడ ఆఫర్లు పొందే ప్రయత్నంలో పలు సినిమాలకు, వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇకపోతే ఎవరైనా సరే సమంతతో పని చేస్తే ఖచ్చితంగా వారు ఆమె గురించి పాజిటివ్గా స్పందించడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా చేరారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రత్యేకంగా సమంత గురించి, ఆమె అందం గురించి పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె గురించి మాట్లాడుతూ.. నేను సమంత గతంలో ఒక యాడ్ లో కలసి నటించాము భవిష్యత్తులో కూడా ఆమెతో మరిన్ని ప్రాజెక్టులో నటించాలని అనుకుంటున్నాను. ఇక ప్రతిభ కలిగిన వ్యక్తి మాత్రమే కాదు అందమైన వ్యక్తి కూడా..

సమంతను ఒక నటిగా, వ్యక్తిగా అభిమానిస్తాను. ముఖ్యంగా ఆమెతో కలిసి నటించే వారితో ఆమె చుట్టూ ఉన్నవారితో కలిసిపోయి సరదాగా ఉంటుంది. భవిష్యత్తులో పూర్తిస్థాయి సినిమా చేసే విషయంపై ప్రస్తుతం ఆలోచిస్తున్నాను . ఇక అందరితో కూడా ఒకే విధంగా మాట్లాడేతత్వం నాకు బాగా నచ్చింది అని ఆమె గురించి చాలా పొగుడుతూ మాటలు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త బాగా వైరల్ అవుతున్నాయి.