అయ్యో .. థాంక్యూ మూవీకి ఇంత కష్టమా.. తెలిస్తే షాక్..!!

దిల్ రాజు నిర్మాణం సారథ్యంలో రాశి కన్నా హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం థాంక్యూ.. ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే చూసిన ప్రతి ఒక్కరు అవాక్కవుతున్న
నిజానికి గత కొన్ని సంవత్సరాలు క్రితం వరకు ఏదైనా కొత్త సినిమా విడుదల అయింది అంటే చాలు వారం పది రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఉండేది. ఇక పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాల విషయానికొస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతూ మార్నింగ్ షోలకు సైతం టికెట్లు దొరకని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంతలా ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.Thank You Telugu Movie (2022) Cast, Release Date, OTT Release Date, OTT  Platform, Streaming Partner & More - Wiki King | Latest Entertainment Newsముఖ్యంగా సినిమా విడుదలైన నెలలోపే ఓటిటి వేదికగా ప్రసారం అవ్వడమే కాకుండా థియేటర్లలో సినిమా చూడడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదుఇక ఈ క్రమంలోని ఈనెల 22వ తేదీన నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా ఆశించని స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోవడం గమనార్హం. ఆరో రోజు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే సాధించింది అంటే ఇక ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అంతేకాదు ఈ సినిమా ప్రదర్శిస్తున్న పలు థియేటర్లలో ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఫ్రీ అని ఆఫర్ కూడా అమలవుతోంది కానీ ఎవరు కూడా సినిమా చూడడానికి రాకపోవడం చాలా ఆశ్చర్యకరం.

నిజానికి నంద్యాల జిల్లా వెలుగోడు లోని రంగా థియేటర్లో 70 రూపాయలకే థాంక్యూ సినిమా టికెట్టుతో ఇద్దరు చూసే అవకాశాన్ని కల్పించారు. అయినా కూడా 100% ఆక్యూపెన్సితో థియేటర్లు నిండకపోవడం గమనార్హం . ఇక భవిష్యత్తులో అయినా సరే ఈ పరిస్థితులు మారాలి అని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు ప్రేక్షకులను ఎలా థియేటర్లకు రప్పించాలో తెలియకపోతే గతంలో టికెట్లు ఫ్రీగా ఇచ్చినా సినిమాలు చూడడానికి ప్రేక్షకులు రారు అనడంలో సందేహం లేదు.