అగ్ని నక్షత్రం: మోహన్ బాబు ఫస్ట్ లుక్ రివీల్.. క్యారెక్టర్ తెలిస్తే షాక్..!!

మోహన్ బాబు తాజాగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అలాగే మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై.. మంచు మోహన్ బాబు , మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం అగ్ని నక్షత్రం. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ఆయన ప్రొఫెసర్ విశ్వమిత్రగా ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. ముఖ్యంగా తన ఆలోచనలతో .. ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డైనమిక్ సైకియాట్రిస్ట్ డాష్ ప్రొఫెసర్ శ్రీ విశ్వామిత్ర. గంభీరమైన లుక్కుతో మోహన్ బాబు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నట్లు సమాచారం . ఇక మోహన్ బాబు ఎవర్ చార్మ్ మంచు లక్ష్మీ ప్రసన్న కలసి తెర పంచుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణటుడు సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మలయాళం లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్ విలన్ గా కనిపించబోతున్నారు ఇకపోతే చైత్ర శుక్ల ద్వితీయ ముఖ్యపాత్రలో.. విశ్వంత్ కథానాయకుడిగా.. జబర్దస్త్ మహేష్ ప్రముఖుల భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రతి ఒక్కరు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి దర్శకుడు ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇలా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచుతున్నారు చిత్రం యూనిట్.

ఇక మంచు లక్ష్మి పలు మలయాళం సినిమాలో షూటింగ్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈమె కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో నటించడమే కాకుండా మరింత ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఏ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంటుంది.

Share post:

Latest