బాల‌కృష్ణ‌తో ఛాన్స్ వ‌స్తే మిస్ చేసుకున్న హీరోయిన్‌..!

అంతపెద్ద అవకాశాన్ని ఎందుకు వద్దనుకుంది? ఆ హీరోయిన్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? సినిమా ఇండ‌స్ట్రీలోని బడా హీరోలతో సినిమాలకోసం ఎంతోమంది హీరోయిన్లు ఎదురు చూస్తూ వుంటారు. అలాంటిది మన బాలయ్యబాబు సినిమా అంటే మామ్మూలు విషయమా? అలాంటిది అతని పక్కన స్టెప్పులేసి అవకాశం వస్తే, ఆమె వద్దనుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ఈ మధ్యే తెలుగు తెరకి పరిచయం అయిన హీరోయిన్ ఎస్తేర్. ఆమె తొలి సినిమానే తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేసింది. ఆ త‌రువాత ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సినిమా అవ‌కాశాన్ని అందుకుంది.

- Advertisement -

కారణం ఇదే:
అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో న‌టించాల‌ని హైద‌రాబాద్ కు రాలేద‌ట‌. వేరే ప‌ని మీద హైద‌రాబాద్ వ‌స్తే అనుకోకుండా సినిమా అవ‌కాశాలు రావ‌డంతో, ఇక్క‌డే ఉండి కొన్ని సినిమాల్లో న‌టించింద‌ట‌. ఆమె ‘భీమ‌వ‌రం బుల్లోడు’ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే బాల‌య్య‌బాబుతో ఓ సినిమా అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అలా చాలా ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ చ‌దువును మ‌ధ్య‌లో ఆపేసి సినిమాల్లో ఉండిపోవ‌డం ఇష్టంలేక సినిమా ఆఫ‌ర్స్‌ను వ‌దులుకుని, చదువుకోవడానికి వెళ్లిపోయిందట. ఆ కారణంగానే మన బాలయ్యబాబు సినిమాను వదులుకుందట.

ఆమె నేపధ్యం ఇదే:
అయితే చ‌దువు పూర్త‌యిన త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. బేసిగ్గా గోవా పోర్చుగీస్ కుటుంబానికి చెందిన ఎస్తేర్ క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో స్థిర‌ప‌డ్డారు. కొంక‌ణి, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో సినిమాల్లో హీరోయిన్ గా న‌టించి, మెప్పించింది. చ‌దువు పూర్త‌యిన త‌రువాత ప్ర‌స్తుతం తెలుగులో అవకాశాలకోసం ఎదురు చూస్తోంది. ఈ మ‌ధ్య 69 సంస్కార్ కాల‌నీ సినిమా ద్వారా మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసినదే. రొటిన్ క‌థ‌ల‌తో కాకుండా భిన్నంగా ఉన్న సినిమాల్లో ట్రై చేస్తోంది. ఈమె తెలుగు రాప‌ర్, సింగ‌ర్ నోయ‌ల్‌ను 2019లో పెళ్లి చేసుకుని, అదే సంవ‌త్స‌రం విడిపోవ‌డం కొసమెరుపు.

Share post:

Popular