తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కీలక సమావేశం.. వీటి పైనే చర్చ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలు మరొకసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీలో వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి సినీ పెద్దలు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో సినీ కార్మికుల సమస్యలను అలాగే ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలి. టికెట్ ధరలు ఎలా నిర్ణయించాలి ఇలా ప్రతి విషయాన్ని కూడా వారు గతంలో చర్చించారు. కానీ ఇప్పుడు తాజాగా మరొకసారి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఒకేచోట కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి మీటింగ్ కి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఆ సమావేశంలో ఏమేం చర్చించుకోబోతున్నారు? అనే విషయాలు కొద్దిగా లీక్ అవడం జరిగింది.వాటి గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం

ఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ తో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ విజయేంద్ర రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా ఓ టీ టీ, టికెట్ రేట్లు అలాగే నిర్మాణ వ్యయంతో పాటు సినిమా హాల్లో తినుబండాల రేట్లపై కూడా చర్చిస్తారు అన్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రొడక్షన్ ఖర్చులన్నీ కూడా డిపార్ట్మెంట్లలో పెరిగిన వేయాన్ని ఎలా తగ్గించాలి అనే విషయంపై కూడా చర్చించబోతున్నట్లు సమాచారం. హీరోలు , హీరోయిన్లు కూడా ఇచ్చే పారితోషకం తో పాటు ఇతర ఖర్చులు ఎక్కువగా చేస్తున్న విషయంపై కూడా నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదు కాబట్టి వారిని ఎలా థియేటర్స్ కు రప్పించాలి అనే విషయంపై ప్రముఖంగా చర్చించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు షూటింగ్స్ బంద్ పై కూడా చర్చ జరగనుంది అన్నట్లు విజయేంద్ర రెడ్డి తెలిపారు. ఈ కీలకమైన సమావేశానికి ఎవరెవరు హాజరుకోబోతున్నారు అనే విషయాన్ని వస్తే నిర్మాత సి.కళ్యాణ్, స్రవంతి రవికిషోర్, జెమినీ కిరణ్, ఏ ఏం రత్నం, దామోదర ప్రసాద్, డైరెక్టర్ తేజ, భారత్ చౌదరి, ప్రసన్నకుమార్ , విజయేంద్ర రెడ్డి తదితరులు గా హాజరు కాబోతున్నారు. ఇక వీరితోపాటు సినీ పెద్దలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.