లేడీ స్టార్‌ క్రికెటర్ మిథాలీ రాజ్ అత‌డి వ‌ల్లే పెళ్లికి దూర‌మైందా…!

సాధారణంగా గతంలో క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నట్టుగానే క్రికెట్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. భాష, ప్రాంతీయ తో సంబంధం లేకుండా చాలామంది తమ ఉనికిని నిరూపించుకోవడానికి భారత మహిళ క్రికెటర్ గా మారుతున్నారు. అలాంటివారిలో మిథాలీ రాజ్ కూడా ఒకరు.

గతంలో ఆడపిల్లలు క్రికెట్ ఆడితే ఏమనుకుంటారో అని ఎన్నో ఇబ్బందులకు గురైన ఈమె ఆ తర్వాత ఎక్కడ భయపడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అఖిల భారత మహిళా క్రికెట్ కే వన్నెతెచ్చిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు కూడా బుధవారం ప్రకటన చేసింది.

ఇకపోతే తన తొమ్మిది సంవత్సరాల వయసు లోనే క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలీరాజ్ ప్రస్తుత వయస్సు 39 సంవత్సరాలు. అందులో 30 సంవత్సరాల జీవితకాలాన్ని క్రికెట్ కి అంకితం చేసింది. క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని అత్యున్నత స్థానాలను చేరుకుంది. ఇక 1982 డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్లోని జోధ్పూర్ లో జన్మించిన ఈమె తన చదువంతా హైదరాబాద్ లోనే పూర్తిచేసింది. తెలుగు ఆడపిల్లలా ఆంధ్ర టీం తరఫున దేశవాళీ క్రికెట్ ఆడింది. మొత్తం అంతర్జాతీయ క్రికెట్ లో 12 టెస్ట్ మ్యాచ్లు.. 89 టీ-20 మ్యాచ్లు. 232 వన్డేలు ఆడింది మిథాలీరాజ్. అంతేకాదు ఈ టెస్టుల్లో అత్యధిక పరుగులు రాబట్టిన ఉమెన్ క్రికెటర్ గా మొదటి స్థానంలో ఉంది.

ఇక ఇంతటి ఘన చరిత్ర సాధించిన ఈమె ఎందుకు వివాహం చేసుకోలేదు అనే విషయానికి వస్తే భారత ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రేమించిందని.. కానీ అతడు ఆయేషా ముఖర్జీ ని వివాహం చేసుకోవడంతో.. మిథాలీ రాజ్ పెళ్లి కూడా చేసుకోకూడదుబాని నిర్ణయం తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవి పుకార్లని వారిద్దరూ వీటిపై ఏమాత్రం స్పందించలేదు. కానీ అభిమానులు మాత్రం మిథాలీరాజ్ తప్పకుండా వివాహం చేసుకోవాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

Share post:

Popular