మహేష్ బాబుకు నచ్చిన యు ట్యూబర్ “నిహారిక”… వైరల్ అవుతున్న వీడియో?

టాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకుని వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న యంగ్ హీరో అడవి శేష్. ఇతను హీరోగా చేసిన తాజా మూవీ మేజర్. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తుండడం విశేషం. ఈ వారంలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం తలమునకలై ఉంది. అందులో భాగంగా మహేష్ బాబు అడవి శేష్ లు చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో మహేష్ మరియు అడవి శేష్ లు సినిమా టికెట్ల కోసం వరుసలో ఉంటారు. ఇందులో భాగంగా అడవి శేష్, మహేష్ బాబు మరియు ఒక యు ట్యూబర్ నిహారిక ల మధ్య జరిగిన సన్నివేశం అందరినీ ఎంతగానో ఆకట్టుకుందని తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో నటించిన ఈ నిహారిక ను మహేష్ బాబు కావాలని పిలిపించుకుని ఈ వీడియో చేశారట.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా ఎవరబ్బా ఈ అమ్మాయి ? ఇంత అందంగా ఉంది.. మహేష్ బాబుకు ఎలా నచ్చింది అంటూ ఆరాలు తీస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె యు ట్యూబ్ లో వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయింది. ఈమె చేసే వీడియోలు మహేష్ బాబును బాగా ఆకట్టుకున్నాయట. అందుకే నిహారికకు మహేష్ ఫాలోయర్ అయిపోయాడు. ఆ కారణంగానే తనకు ఎంతో ఇంపార్టెంట్ అయిన మేజర్ సినిమా ప్రమోషన్స్ కోసం వీడియోలను చేయిస్తున్నాడట. కాగా ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజజీవిత కథ ఆధారంగా తెరెకెక్కుతూ ఉంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా అయిపోయింది. వారు తెలిపిన ప్రకారం ఈ సినిమా ఒక మంచి యాక్షన్ ఎమోషనల్ డ్రామా గా ఉంటుందట.

ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ మంచి ఫీల్ తో థియేటర్ నుండి వెలుతారట. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క డైరెక్టర్ గా చేశారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఇందులో శోభిత ధూళిపాళ్ల మరియు సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అడవి శేష్ అమెరికా నుండి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుని వరుస సినిమాలను చేసుకుంటూ సక్సెస్ బాట పట్టాడు. మరి జూన్ 3 న రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Share post:

Popular