వ‌య‌స్సు ముదురుతున్నా పెళ్లికి దూరం అంటోన్న ముద్దుగుమ్మ‌లు…!

వారిని చూస్తే, పెళ్లి అనేది సినిమా తారలకు మినహాయింపేమో అనిపించక మానదు. పెళ్లి అంటే నూరేళ్ళ పంట. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అని చెబుతూ వుంటారు. ఈ సంగతి మన సినిమా తారలు కూడా చెబుతారు, అద్భుతంగా నటిస్తారు. కానీ వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం, పెళ్లిని కాస్త పక్కన బెడతారు. బేసిగ్గా బయట అమ్మాయిలకు 25 దాటితేనే పెళ్లి గురించి బెంగ మొదలవుతుంది. కానీ సినిమా తారలు మాత్రం 35 దాటినా సరే, ఆ ఊసే ఎత్తడం లేదు. అలా వయసు ముదిరిన తారలు లిస్ట్ పెద్దదే ఉంటుంది.

నిన్న మొన్నటివరకు ఒంటరిగా వున్న, నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కి వార్తల్లో నిలిచారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు ఇంకా పెళ్లిమాట ఎత్తడమే లేదు. అలంటి హీరోయిన్లలో ముందువరుసలో ఉంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. నేటికి ఆమెకి 33 సంవత్సరాలు. వరుసగా సినిమాలు చేస్తూ పోతోంది తప్ప, పెళ్లికి సంబంధించిన శుభవార్త మాత్రం చెప్పడం లేదు.

తమన్నా బెస్ట్ ఫ్రెండ్ అయిన కాజల్ అగర్వాల్ అయితే రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి కూడా అయిపోయింది. అలాగే మరో ముదర స్టార్ హీరోయిన్ అనుష్క కూడా పెళ్లి విషయంలో వెనకడుగు వేస్తోంది. ఇంకా త్రిష విషయానికొస్తే మన చిన్నప్పడినుండి ఆమెని సినిమాలలో చూస్తున్నాం. ఎవరెవరితోనో ప్రేమాయణం నెరుపుతోంది గాని, పెళ్లి అంటే మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది.

ప్రస్తుతం త్రిష వయస్సు తెలిస్తే షాక్ అవుతారు. 39 సంవత్సరాలు మన ముద్దుగుమ్మకు. ఈ లిస్టు ఇంటితో అయిపోలేదు.. ఛార్మీ కౌర్ గురించి చూసుకుంటే భూమి పుట్టకముందు పుట్టింది. అయితే పెళ్లి మాత్రం చేసుకోనని తెగేసి చెబుతోంది. ఇంకా చూసుకుంటే నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ కోవకే చెందుతారు. వీరందరూ త్వరలో ఓ ఇంటివారు కావాలని కోరుకుందాం.

Share post:

Popular