ఆ హీరోకి సహకరించని ప్రముఖ హీరోయిన్.. కారణం.?

ప్రస్తుతం ఆ హీరో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీద ఉన్నాడు. ఇక ప్రేమ కథా చిత్రాలతో మంచి హిట్లు అందుకుంటున్న ఇతడు ఇంతలోనే ఒక డిఫరెంట్ జోనర్ ను టచ్ చేసి ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే సింగిల్ సినిమానే ఫెయిల్యూర్ అయినప్పటికీ తన కెరియర్ మీద ప్రభావం అయితే ఎక్కువగా చూపుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఆ హీరో మళ్ళీ తిరిగి తన పాత ట్రాక్ లోకి వచ్చి అదే లవ్ స్టొరీ తో సినిమా చేశాడు. ఈ సినిమాకి కూడా టాలీవుడ్ లో ఉన్న అగ్ర బ్యానర్ ల అండదండలు దొరకడంతో అమెరికా లాంటి చోట కూడా ఈ సినిమా చాలా వైడర్ గానే రిలీజ్ అవుతోంది. ఇకపోతే యూఎస్ఏ లో ఏకంగా 150 లొకేషన్లను ఈ సినిమా కోసం బ్లాక్ చేశారనే వార్త వినిపిస్తోంది. ఇక ఇదంతా బాగానే ఉన్నా ఈ సినిమా విడుదలకు ముందు ప్రచారానికి హీరోయిన్ సహకరించకపోవడమే ప్రస్తుతం వార్తలకు తెర తీస్తోంది.

ముఖ్యంగా ఆ హీరో కి హీరోయిన్ కి మధ్య ఎక్కడ చెడింది.. అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక హీరో మాత్రం ఆ హీరోయిన్ ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్ విషయంలో జోరుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మరి ఈ గ్లామరస్ హీరోయిన్ లేకుండా ప్రమోషన్స్ ఎంతవరకు కలిసి వస్తాయో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఈ హీరో హిట్ కొట్టిన ఆ రెండు సినిమాల రేంజ్ లో ఈ సినిమా లో కంటెంట్ ఉందా లేదా అనే విషయం ప్రస్తుతం సందేహాలకు దారితీస్తోంది.

ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ సపోర్టు ఉన్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై కాలంతో పాటు ప్రేక్షకులు నిర్ణయిస్తారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే హిట్ కొట్టాల్సిన ఇలాంటి సమయంలో ఎవరి సహకారం లేకపోయినా సదరు హీరో ప్రచారంలో చాలా కష్టపడుతూ పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇతడి కష్టానికి అదృష్టం కూడా తోడై ఫలితం లభిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Share post:

Popular