గుట్టుచప్పుడు కాకుండా పవన్ సీక్రేట్ పూజా..ఇండస్ట్రీలో కొత్త ప్రకంపనులు..?

యస్..ఇప్పుడు అటు రాజకీయాలోను..ఇటు సినీ ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ గా మారిపోయారు మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ పేరుకున్న పవన్ అలాంటిది అని కొందరు అంటుంటే…మరికొందరు పేరు కే పవర్ ఉంది..మనిషి కి కాదు అంటూ ఎగతాళి చేస్తుంటారు. కానీ, పవన్ అవి ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. పవన్ సినిమాలు వస్తున్నాయంటే జనాలకు అదేదో తెలియని ఊపు వస్తుంది. ఆయన అలా తెర పై డ్యాన్స్ చేస్తుంటే.. సీట్లల్లో కూర్చున్న జనాలు కూడా ఊగిపోతారు..అంత టాలెంట్ ఉన్న ఈ హీరో..ఎవ్వరు ఊహించని విధంగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి..రాజకీయాల్లోకి వెళ్ళడం కొంచెం షాక్ కు గురి చేసే విషయమే.

- Advertisement -

అయితే, మళ్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు రాజకీయాలను..సినిమాలను సమాంతరంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. కనీసం ఒక్కదానికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మరో దానిని వదులుకోవాల్సిందే..ఇప్పుడు పవన్..తనకు లైఫ్ ఇచ్చిన సినిమాల కోసం రాజకీయాలని వదులుకుంటాడా ..లేక జనాలకు లైఫ్ ఇవ్వడం కోసం సినిమాలను వదులుకుంటాడా అనేది ప్రశ్నారధకంగా మారింది. అయితే, ఇప్పుడు పవన్ చేసిన మరో పని ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది.

పవన్ కల్యాణ్ ఎంత బిజీగా ఉన్న వరుస సినిమా ఆఫర్లు వెంట పడుతున్నాయి. ఈ క్రమంలోనే సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదియ సిత్తం’ అనే తమిళ చిత్ర రీమేక్ లో పవన్ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, పవన్ ఈ సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలను గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేశారంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాలల్లో తెగ హల్ చల్ చేస్తుంది. కాగా, దీని పై అఫిషీయల్ ప్రకటన లేనప్పటికి సినీ ప్రముఖులు కూడా ఈ వార్త నిజమే అంటున్నారు. అస్సలు పవన్ ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎందుకు సైలెంట్ గా చేశారు..? బ్యాక్ గ్రౌండ్ లో ఏం ప్లాన్ వేశారు..? అనేది విశ్లేషకులకు సైతం ఊహకందని మ్యాటర్. కాగా, ఈ సినిమా కోసం కేవలం పవన్ 20 రోజుల కాల్ షీట్లే ఇచ్చాడని..దాని కోసం కూడా 50 కోట్లు వరకు పారితోషకం పుచ్చుకుంటున్నాడని..వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular