ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..!

ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..! అంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే జరుపుకోవడమే. అదేంటి ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు అసలు ఏంటీ సంబంధం అనుకుంటున్నారా..? అక్కడికే వస్తుంది అసలు విషయం. కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే.

భారీ యాక్షన్ సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడని అందరూ చెప్పుకున్నారు. తిరుగులేని ఎలివేషన్స్ తో ప్రశాంత్ నీల్ హీరోలని అద్భుతంగా చూపించే దర్శకుడిగానూ విపరీతమైన పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన కెజిఎఫ్2 ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రశాంత్ నీల్ ఈ శనివారం రోజున తన 42వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఇది కూడా హోంబలే నిర్మాణ సంస్థలో జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ కి సోషల్ మీడియాలో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు శుభాకాంక్షలు తెలిపారు. పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్, హీరో యష్, కెజిఎఫ్ చిత్ర యూనిట్ కొంతమంది ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

అంతేకాదు, ఈ వేడుకల్లో ప్రభాస్, ప్రశాంత్ కోసం ఏడు అడుగుల కేక్ ని ఇచ్చాడు. అయితే, ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అఫీషియల్ గానూ అనౌన్స్ చేశారు. అయితే, ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ 31 స్క్రిప్ట్ రెడీ చేయలేదని, బేసిక్ ఐడియా పైనే వర్క్ చేస్తున్నాడని ప్రస్తితం ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ చెప్పలేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే కి స్పందించకపోవడంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినా కూడా ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పక పోవడంతో ఇప్పుడు యాంటి ఫ్యాన్స్ కొందరు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కి మధ్య ఎదో జరిగింది… ఎన్టీఆర్ 31 ఉంటుందో లేదో.. అనే రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ రూమర్స్ ని ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇండియాలో లేరని అంటున్నారు, ప్రస్తుతం కొరటాల శివ చిత్రం కోసం సరికొత్త మేకోవర్‌తో రెడీ అవుతున్నారని, సోషల్ మీడియాలో విషెస్ చెప్పకపోతే నేరుగా ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చుకదా..అనవసరంగా ఎందుకు ఇలాంటి పనికిమాలిన రూమర్స్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ గట్టిగానే ఇస్తున్నారు. కొరటాల సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ 31న సెట్స్‌పైకి వస్తుందని..దానికి ఇంకా ఏడాది సమయం ఉంది అని క్లారిటీ ఇస్తున్నారు.

Share post:

Latest